హైదరాబాద్ లోని ఎంఐఎంకు చెందినటువంటి ఐదుగురు ఎమ్మెల్యేలను పోలీసులు అరెస్టు చేసి బొల్లారం పోలీసు స్టేషన్ కు తరలించారు. హైదరాబాద్ పాత బస్తీలో చోటుచేసుకున్నటువంటి సంఘటనలతో ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు వారిని అరెస్టు చేసినట్లు తెలుస్తుంది. పాత బస్తిలోని కొన్ని సమస్యత్మాక ప్రాంతాల్లో పోలీసులు గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. పాతబస్తికి చెందిన జియాగూడ, మొగల్ పురా, పలక్ నామ, చార్మీనార్,టబచాబుత్ర, మాందపూర్ తదితర ప్రాంతాల్లో పోలీస్ పికెటింగ్ లు ఏర్పాటుచేసినటువంటి పోలీసు అధికారులు ఎప్పటికప్పడు పరిస్థితుల గూర్చి తెలుసుకుంటున్నారు. కాగా ఇప్పటి వరకు పాతబస్తీ ప్రశాంతంగానే ఉందని నగర పోలీస్ కమీషనర్ అనురాగశర్మ తెలియజేశారు. హైకోర్టు ఉత్తర్వులను మాత్రమే అమలు చేస్తున్నామని ఇందులో ఎటవంటి అనుమానాలు లేవని సిపి వివరించారు. బాగ్యలక్ష్మి ఆలయం వద్ద ప్రశాంత వాతావరణం ఉందని, ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి: