ప్రకాషం జిల్లాలో పొగాకు రైతులు తమకు ఇక ఆత్మహత్యే శరణ్యమంటున్నారు. ఇటీవల అకాల వర్షాలు పొగాకు పంటను తీవ్రంగా దెబ్బతీశాయి. ముదురు తోటలు పనికి రాకుండా పోయాయి. క్యూరింగ్లో ఎక్కువగా మాడు ఆకు వస్తొంది. కనీసం కాల్పు ఖర్చులు కూడా వచ్చే పరిస్థితి లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక్క బ్యారన్ కింద 7 నుంచి 10 ఎకరాల దాకా పొగాకు సాగుచేస్తారు. బ్యారక్ కు ఒక పచ్చాకు కొట్టకు కొట్టుకు, తోటలో ఆకు వలిచి కర్రలకు అల్లడం చేసే వచ్చిన ముటాకు క్యూరింగ్ కలప, బ్యారన్ డ్రైవర్, బ్యారన్ల అద్దె, గ్రేడింగ్ ఖర్చులు చూస్తే దాదాపు రూ.30వేల దాకా పెట్టుబడులవుతాయి. అయితే వీరికి రూ.16 వేల ఆదాయం మాత్రమే వస్తోంది. ఒక్కో కొట్టుకు రూ.6 వేలు దాకా నష్టాలు వస్తున్నాయి. ఇక పొగాకు సాగుకు సంబంధించి సేధ్యం, నారు, ఎరువులు, నాట్లు, నీళ్లు, వంటి ఖర్చులున్నాయి. ఇవి ఎకరానికి దాదాపు రూ.10 వేలు అవుతుంది. ఇది కూడా కలుకుంటే తమకు నష్టాలు మరింత పెరుగుతాయని రైతులు అంటున్నారు. ఇప్పటికే జిల్లాలో అనేక మంది పొగాకు రైతులు అప్పులోల కూరుకుపోయారు. వీరంతా తమకు ఆత్మహత్యలే శరణ్యమంటున్నారు.
మరింత సమాచారం తెలుసుకోండి: