అనగనగా ఒక అడవిలో ఒక చెట్టు మీద రెండు రామ చిలుకలు ఉన్నాయి. ఆ చిలుకలు చక్కగా గూడు కట్టుకుని తమ పిల్లలతో సంతోషంగా కాలాన్ని గడుపుతున్నాయి. ఒక నాడు పొద్దున్నే అమ్మ చిలుక నాన్న చిలుక ఇద్దరూ కలిసి ఆహారం కోసం చూస్తూ బయటకు వెళ్ళాయి. ఇంతలో ఒక బోయవాడు పిల్ల చిలుకను దొంగలించాడు.

అందులో ఒక రామచిలుక ,బోయ వాడి నుంచి ఎలాగో తప్పించుకొని,  ఒక ఆశ్రమంలో  వున్న చెట్టుపై వాలి,  అక్కడ ఋషులు బోధిస్తున్న చక్కని మంచి మాట వింటూ పెరిగింది. ఇంకొక రామచిలుకలను బోయవాడు  ఒక పంజరంలో బంధించి ఉంచుకున్నాడు. అది వాడి ఇంటి లోపలే  పెరిగింది. ఆ చిలుక ఎంతసేపు ఇంట్లో చెడు మాటలు వింటూ పెరిగింది. ఆ మాటలనే నేర్చుకుంది.

ఒక నాడు ఒక బాటసారి,  బోయవాడి ఇంటి దగ్గర వున్న  చెట్టు కింద పడుకున్నాడు. అది చూసి రామచిలుక ఒరేయ్ మూర్ఖుడా ఇక్కడ ఎందుకు పడుకున్నావు రా..?  నీ  నాలుకను  కోసేస్తాను అంటూ భయపెట్టింది. వాడు ఏం చేయలేక అక్కడినుంచి పారిపోయాడు. అలా ప్రయాణించిన వ్యక్తీ  చివరకు ఆశ్రమం చేరాడు. అక్కడున్న రామచిలుక స్వాగతం బాటసారి .. మీ అలుపు తీరే వరకు ఇక్కడే విశ్రమించవచ్చు. అంటూ తీయగా పలికింది.

ఆశ్చర్యపోతూ ఆ బాటసారి  ఇలాంటి రామచిలుకలనే  నేను దారిలో కలిశాను. కానీ అది చాలా కటువుగా మాట్లాడుతోంది అన్నాడు. ఓహో బహుశా అది నా అన్న చిలుక అయ్యి ఉంటుంది. నేను సాధువులతో సాంగత్యం చేశాను. కనుక నా భాష ఇలా ఉంది. అదే నా అన్నా వేటగాడి భాష  నేర్చుకుని అలా మాట్లాడుతున్నాడు. మనం ఎలాంటి సాంగత్యంలో  ఉంటామో అలాగే తయారవుతాయి. అని ఆ బాటసారి తో  రామచిలుక పలికింది..ఇక ఈ రామ చిలుక మాటలు విన్న బాటసారి మంచివారితోనే సావాసం చేయాలి అని చెప్పాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: