గత ఏడాది చివర్లో జరిగిన ఐపీఎల్ ముగియగానే భారత జట్టు అటు నుంచి అటే ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే.  ప్రస్తుతం కరోనా  వైరస్ వ్యాప్తి సమయంలో బయో సెక్యూర్ బబుల్ పద్ధతిలో ప్రస్తుతం ఆటగాళ్లు క్వారంటైన్ లో ఉంటూ మ్యాచ్ ఆడుతున్నారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇక ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన భారత జట్టు అక్కడ ఆస్ట్రేలియా జట్టుతో టి20, వన్డే,టెస్ట్ సిరీస్ లు  ఆడింది. ఇక ఈ రోజుతో ఆస్ట్రేలియా పర్యటన పూర్తి కాబోతుంది అనే విషయం తెలిసిందే. ఇక ఆస్ట్రేలియా పర్యటన ముగియగానే ఇంగ్లాండ్ జట్టుతో భారత్ వరుసగా సిరీస్ లు  ఆడేందుకు భారత జట్టు సిద్ధమైంది.


 ఇక వచ్చే నెలలో ఇంగ్లాండ్ తో  వరుసగా సిరీస్ లు  ఆడనుంది భారత జట్టు. ఈ క్రమంలోనే ఫిబ్రవరి 5 నుంచి ఇంగ్లాండ్ తో  ప్రారంభం కాబోయే టెస్ట్ సిరీస్ కోసం భారత జట్టును ఈరోజు బిసిసిఐ సెలక్షన్ కమిటీ ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. అయితే..  ప్రస్తుతం భారత జట్టు ప్రకటన కొత్త చైర్మన్ చేతన్ శర్మ ఆధ్వర్యంలో జరుగుతూ ఉండటం గమనార్హం. కొత్త సెలక్షన్ కమిటీ చైర్మన్ అయిన చేతన్ శర్మ ఇక ఇంగ్లాండ్ తో  ఆడబోయే భారత జట్టును సెలెక్టర్లు చేయనున్నారు. ఈ క్రమంలోనే భారత జట్టు లో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయి అన్న దానిపై ఆసక్తి నెలకొంది.



 ఇక కొత్త చైర్మన్ ఆధ్వర్యంలో కొత్త జట్టు ఏది ఎంపిక అవుతుంది అని అటు భారత ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సెలక్షన్ కమిటీ చైర్మన్ చేతన్  శర్మ ఆధ్వర్యంలో తొలి రెండు టెస్టుల కోసం నేడు జట్టును ఎంపిక చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే వరుసగా భారత ఆటగాళ్లు గాయాల బారిన పడిన నేపథ్యంలో ప్రస్తుతం బిసిసిఐ సెలక్షన్ కమిటీ చైర్మన్ చేతన్  శర్మ ఏ ఆటగాళ్లకు తుది జట్టులో స్థానం కల్పించనున్నారు అన్న దానిపై ఆసక్తి నెలకొంది. ఇకపోతే ఆస్ట్రేలియా పర్యటన ముగియగానే ఈనెల 27వ తేదీన చెన్నైలో బయో బబుల్  లోకి వెళ్ళిపోతారు భారత ఆటగాళ్లు.

మరింత సమాచారం తెలుసుకోండి: