ప్రస్తుతం భారత పర్యటన లో ఉన్న సౌత్ ఆఫ్రికా జట్టు టీమ్ ఇండియాతో మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ ఆడుతోంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మొన్నటికీ మొన్న జరిగిన మొదటి వన్డే మ్యాచ్లో ఉత్కంఠ భరితమైన పోరు లో 9 పరుగుల తేడాతో సౌత్ఆఫ్రికా విజయం సాధించింది. ఇకపోతే నేడు రెండవ వన్డే మ్యాచ్ జరగబోతుంది. ఇక ఈ వన్డే మ్యాచ్ సిరీస్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవడానికి టీమిండియా కు కీలక మైన మ్యాచ్ గా మారిపోయింది.


 రెండు వన్డే మ్యాచ్లో టీమిండియా తప్పక గెలవాల్సి ఉంది. లేదంటే సిరీస్ ఇక సౌత్ ఆఫ్రికా చేతిలో పెట్టినట్లే అవుతుంది. అయితే రాంచీ వేదికగా ఇక రెండో వన్డే మ్యాచ్ జరుగుతూ ఉండడం గమనార్హం. అయితే రాంచి మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని పుట్టినిల్లు అన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే జట్టు ఆల్రౌండర్ శార్దూల్ ఠాగూర్. ఇటీవల మీడియాతో మాట్లాడుతూ ధోనిని గుర్తు చేసుకున్నాడు.  మహేంద్ర సింగ్ ధోని ఎంతో అనుభవజ్ఞుడైన ఆటగాడని.. అతడిని ఎంతో మిస్ అవుతున్నాము అంటూ చెప్పుకొచ్చాడు. జట్టులోని ప్రతి ఒక్కరం ధోనిని మిస్ అవుతున్నాం.


 300 కంటే ఎక్కువ వన్డేలు దాదాపు 90 టెస్టులు ఎన్నో టి20 మ్యాచ్ లు ఆడాడు ధోని. అతడి లాంటి అనుభవజ్ఞుడు ఉండడం చాలా అరుదు అంటూ శార్దూల్ ఠాగూర్ చెప్పుకొచ్చాడు. ఇక బౌలింగ్ నిలకడలేమిపై శార్దూల్ ఠాగూర్ ను విలేకరులు ప్రశ్నించగా గట్టిగా కౌంటర్ ఇచ్చాడు. ప్రత్యర్థి బౌలింగ్ లోను భారత బ్యాట్స్మెన్లు చెలరేగిపోతున్నారు అన్న విషయం మరిచిపోవద్దని పిచ్, గ్రౌండ్ పరిస్థితులను కూడా పరిగణలోకి తీసుకోవాలి అంటూ వ్యాఖ్యానించాడు శార్దూల్ ఠాగూర్. ఇకపోతే ఇప్పటికే సౌత్ ఆఫ్రికా తో టీమ్ ఇండియా టి20 సిరీస్ ఆడి విజయం సాధించింది అన్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: