సాధారణంగా ప్రతి ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభానికి ముందు మినీ వేలం జరుగుతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఈ మినీ వేలంలో భాగంగా అటు ఎంతో మంది ఆటగాళ్ళు ఒక జట్టు నుంచి మరో జట్టులోకి తారుమారు అవడం లాంటివి కూడా జరుగుతూ ఉంటుంది. అయితే గత ఏడాది ఏకంగా రెండు కొత్త జట్లు ఐపీఎల్లోకి ఎంట్రీ ఇచ్చిన నేపథ్యంలో మెగా వేలు నిర్వహించింది బీసీసీఐ ఈ మెగా వేలంలో భాగంగా అంతర్జాతీయ క్రికెట్లో స్టార్ ప్లేయర్లుగా కొనసాగుతున్న వారికి భారీ డిమాండ్ ఉంటుందని అనుకున్నప్పటికీ అందరూ అంచనాలు తారుమారు అయ్యాయి.


 ఊహించని రీతిలో అన్ని ఫ్రాంచైజీలు కూడా యువ ఆటగాళ్లు మాత్రమే తమ జట్టులోకి తీసుకోవడానికి ఆసక్తి చూపాయి. దీంతో ఎంతోమంది స్టార్ ప్లేయర్స్ సైతం అన్ సోల్డ్ గానే మిగిలిపోయారు అని చెప్పాలి. ఇక ఇప్పుడు మరికొన్ని రోజుల్లో మినీ వేలం జరగబోతున్న నేపథ్యంలో ఇక ఈ వేలంలో ఎవరికి ఎక్కువ డిమాండ్ ఉంటుంది అనేదానిపై మరోసారి అంచనాలు తెర మీదకి వచ్చాయి. ఎంతోమంది స్పందిస్తూ ఇక అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ ఉన్నారు అని చెప్పాలి. ఇదే విషయంపై టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా కూడా స్పందించాడు.


 ఈ క్రమంలోనే 2023 ఐపీఎల్ సీజన్ వేలంలో కొందరు విదేశీ ప్లేయర్లకు భారీ డిమాండ్ ఉంటుందని ఆకాష్ చోప్రా అభిప్రాయం వ్యక్తం చేశాడు. అందులో ఆస్ట్రేలియాకు చెందిన కామెరన్ గ్రీన్, ఇంగ్లాండుకు చెందిన  సామ్ కూరాన్, ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ లు అత్యధిక ధర పలుకుతారు అంటూ జోస్యం చెప్పాడు ఆకాష్ చోప్రా. ఇక మయాంక్ అగర్వాల్, మయాంక్ మార్కండే, పియూస్ చావ్లా, అమిత్ మిశ్రా, సికిందర్ రాజా, రోసో లాంటి క్రికెటర్లను కొనేందుకు కూడా ఫ్రాంచైజీలు ఎక్కువగా పోటీ పడతాయని అంచన వేశాడు..  ఇక ఐపీఎల్ వేలంలో జట్లు ఎవరిని కొనేందుకు పోటీ పడతాయి అన్నది కూడా ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl