క్రీడా ప్రపంచం మొత్తం వేయికళ్లతో ఎదురుచూస్తున్న ఫైనల్ మ్యాచ్ మరికొన్ని గంటలో ప్రారంభం కాబోతోంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే వరల్డ్ కప్ లో టైటిల్ విజేతగా ఎవరు నిలుస్తారు అన్నది ఆసక్తికరంగా మారిపోయింది అని చెప్పాలి. అయితే ఇక ప్రస్తుతం ఫైనల్ కు చేరిన రెండు జట్లు కూడా టైటిల్ ఫేవరెట్ గానే ప్రపంచ కప్ లో బదిలోకి దిగాయి అని చెప్పాలి. ఒకటి డిపెండింగ్ ఛాంపియన్ హోదాలో ఉంటే మరొక జట్టు మాజీ ఛాంపియన్గా కొనసాగుతూ ఉంది.


 ఈ క్రమంలోనే అర్జెంటిన జట్టు కెప్టెన్ లియోనల్ మెస్సి తో పాటు ఫ్రాన్స్ స్టార్ ప్లేయర్ అయినా క్లిలియన్ అంబాపే సైతం ఇక ఫైనల్ మ్యాచ్లో ప్రధాన ఆకర్షణగా నిలవనన్నారు అన్నది తెలుస్తుంది. పటిష్టమైన ఇరు జట్ల మధ్య కూడా తీవ్రమైన పోటీ ఉండడం ఖాయం అన్నది ప్రస్తుతం క్రీడా నిపుణులు  వేస్తున్న అంచనా. ఈ క్రమంలోనే ఈ ఫైనల్ పోరును వీక్షించేందుకు క్రీడా ప్రపంచం మొత్తం సిద్ధమైంది అని చెప్పాలి. ఇకపోతే ఫైనల్ మ్యాచ్ లో మాజీ ఛాంపియన్స్ అయిన ఫ్రాన్స్ జట్టు కి భారీ షాక్ తగిలింది అని చెప్పాలి  ఎందుకంటే జట్టులో స్టార్ ప్లేయర్లుగా కొనసాగుతున్న ముగ్గురు జట్టుకు దూరమయ్యే పరిస్థితి ఉంది అన్నది తెలుస్తుంది.


 ప్రస్తుతం ఫ్రాన్స్ జట్టులో స్టార్ డిపెండర్లుగా కొనసాగుతున్న రాఫెల్ వరానే, ఇబ్రహీమ కొనాటేతోపాటు అటాకర్ కింగ్ స్లీ కోమన్ కూడా జట్టుకు దూరమయ్యే అవకాశం ఉందట. వీరు ముగ్గురు కూడా అనారోగ్యం బారిన పడినట్లు తెలుస్తుంది. దీంతో ఇటీవల జరిగిన ట్రైనింగ్ సెషన్లో కూడా ఈ ముగ్గురు ఆటగాళ్లు పాల్గొనలేదట. అయితే స్వల్ప వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నారని.. దీంతో ప్రాక్టీస్ సెషన్ లో పాల్గొనలేదని.  ఇక వాళ్లలో కనిపిస్తున్న జ్వరం లక్షణాలు తీవ్రమైనవి కావు అని.. ఫైనల్ మ్యాచ్ కి అందుబాటులో ఉంటారని ఆశాభావంవ్యక్తం చేస్తున్నాము అంటూ ఫ్రెంచ్ ఫుట్బాల్ ఫెడరేషన్ వెల్లడించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: