క్రీడా ప్రపంచం మొత్తం విషాదంలో మునిగిపోయింది. ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది అభిమానుల గుండెల్లో గుడి కట్టుకున్న దిగ్గజ ఫుట్బాల్ ప్లేయర్ పీలే ఇక లేరు అన్న విషయాన్ని అభిమానులు అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఫుట్బాల్ ఆటకే ప్రపంచ వ్యాప్తంగా వన్నెతెచ్చిపెట్టిన లెజెండ్ పీలే 82 ఏళ్ల వయసులో ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయారు. ఈ క్రమంలోనే అభిమానులే కాదు సగటు ప్రేక్షకుడి గుండె బద్దలైంది అని చెప్పాలి. క్రీడా ప్రపంచం మొత్తం లెజెండరీ ఆటగాడికి తుదిసారి వీడ్కోలు పలుకుతుంది.


 ఇకపోతే ఇటీవలే ఎక్కడ చూసినా పీలే జీవితం ఎలా సాగింది.. ఫుట్బాల్ లో ఆయన ఎలాంటి రికార్డులు సాధించారు అన్న విషయాలే హాట్ టాపిక్ గా మారిపోయాయి అని చెప్పాలి. కాగా ప్రపంచం గర్వించదగ్గ క్రీడాకారిడిగా ఎదిగిన పీలే బాల్యం కడుపేదరికంలో సాగింది. తండ్రి ఫుట్బాల్ ప్లేయర్ అయినప్పటికీ కనీసం సొంతంగా ఫుట్బాల్ కొనిచ్చేంత స్తోమత కూడా లేదు. దీంతో సాక్షుల్లో పేపర్లు నింపుకొని బంతిలా తయారు చేసి ఫుట్బాల్ ఆడేవాడు పీలే. చిన్నతనం నుంచి ఫుట్బాల్ పై మమకారం పెంచుకున్న పీలే బాల్యంలో స్థానిక ఫుట్బాల్ క్లబ్  మ్యాచ్ లు ఆడేవాడు. ఇలా పట్టు వదలని విక్రమార్కుడిలా అంచలంచలుగా ఎదిగాడు.


అయితే పీలే అసలు పేరు పీలే  కాదు అన్న విషయం తెలిసి అభిమానులు షాక్ అవుతున్నారు అని చెప్పాలి. ఇంతకీ ఫీలే అసలు పేరు ఏంటో తెలుసా..  'ఎడిసన్‌ అరాంట్స్‌ డో నాసిమియాంటో'. పేరు పలకడమే కష్టంగా ఉంది కదా. కానీ ఇది నిజంగా పీలే ఒరిజినల్ నేమ్. అయితే తన అసలు పేరు అర్థం ఏంటో తనకే తెలియదు అంటూ ఫీలే ఒక సందర్భంలో చెప్పుకొచ్చారు. అయితే పీలే పేరు ఎలా వచ్చింది అన్న విషయాన్ని కూడా ఆయన ఒకానొక సమయంలో స్వయంగా వెల్లడించారు. పోర్చుగీస్ భాషలో ఫుడ్ బాల్ ను పాదంతో కిక్ కొడితే పీ అని.. అదే సమయంలో నేను చేసిన తప్పులను ఎత్తి చూపుతూ పోర్చుగీసు భాషలో లే అనే పదం వాడారు. ఇక ఆ తర్వాత కాలంలో అందరూ పీలే.. పీలే అని పిలవడం మొదలుపెట్టారు. ఇక అదే నా అసలు పేరుగా మారిపోయింది అంటూ ఓ ఇంటర్వ్యూలో పీలే చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: