కొత్త ఏడాదిని ఎంతో ఘనంగా ప్రారంభించినందుకు టీమిండియా సిద్ధమైంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఏకంగా భారత పర్యటనకు వచ్చిన శ్రీలంక జట్టుతో నేటి నుంచి టి20 సిరీస్ ఆరంభించబోతుంది టీమ్ ఇండియా జట్టు. అయితే యువ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో ఈ టి 20 సిరీస్ లో భాగంగా బరిలోకి దిగబోతుంది అన్న విషయం తెలిసిందే. అయితే టి20 సిరీస్ ముగిసిన వెంటనే ఏకంగా మూడు వన్డే మ్యాచ్ ల సిరీస్ కూడా ఆడబోతుంది టీమ్ ఇండియా జట్టు. అయితే ఇక ఈ టి20 సిరీస్ లో భాగంగా తొలి టీ20 మ్యాచ్ ముంబై వేదికగా జరగబోతుంది.


 అయితే ఈ టి20 సిరీస్ కు రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రమే కాదు సీనియర్ ఆటగాళ్లుగా కొనసాగుతున్న విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ కూడా జట్టుకు దూరమయ్యారు. అయితే ఇక జట్టు కెప్టెన్ గా హార్దిక్ పాండ్యా వ్యవహరిస్తూ ఉండగా.. ఎంతో మంది యువ ఆటగాళ్లు అటు తొలిసారి భారత జట్టులో అడుగు పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. శివం మావి, ముఖేష్ కుమార్ అటు తొలిసారి టీమిండియాలోకి అరగటం చేయబోతున్నారు.. అంతేకాకుండా ఇక టీమిండియాలోకి మరో కొత్త ఓపెనర్ రాబోతున్నాడు అన్నది తెలుస్తుంది.



 ఇప్పటికే టీమ్ ఇండియా తరఫున వన్డే, టెస్ట్ ఫార్మట్లలో అరంగేట్రం చేసి తన అద్భుతమైన ప్రదర్శనతో అదరగొడుతున్న యువ ఓపెనర్ శుభమన్ గిల్ ఇక ఇప్పుడు టి20 ఫార్మాట్లో కూడా శ్రీలంకతో సిరీస్ లో ఛాన్స్ దక్కింది. అయితే అంతకుముందు న్యూజిలాండ్తో టి20 సిరీస్ కు గిల్ కు భారత జట్టులో చోటు దక్కినప్పటికీ తుది జట్టులోకి మాత్రం రాలేదు. కాగా ఇప్పుడు మాత్రం తుది జట్టులోకి రావడం ఖాయంగా కనిపిస్తుంది. ముంబై వేదికగా శ్రీలంకతో జరిగే తొలి మ్యాచ్ లో తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఆడబోతున్నాడు. రెగ్యులర్ ఓపెనర్లుగా ఉన్న రోహిత్ శర్మ కేఎల్ రాహుల్ జట్టుకు దూరంగా ఉన్న నేపథ్యంలో ఇక ఇషాన్ కిషన్ కు జోడిగా శుభమన్ గిల్ ను పంపాలని మేనేజ్మెంట్ భావిస్తుందట. ఈ కొత్త ఓపెనింగ్ జోడి ఎలా అలరించబోతుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: