
ఈ క్రమం లోనె అప్పటివరకు అసలు భారత కెప్టెన్సీ రేసులో హార్దిక్ పాండ్యా పేరు ఎక్కడ కనిపించ లేదు. కానీ గుజరాత్ కెప్టెన్గా అతని సక్సెస్ అయిన తర్వాత మాత్రం అందరిని వెనక్కి నెట్టేసి ఇక ఫ్యూచర్ కెప్టెన్ అతనె అని నమ్మే విధం గా ప్రభావితం చేశాడు అని చెప్పాలి. ఇక ఇటీవల కాలంలో టీమ్ ఇండియా కెప్టెన్ గా కూడా అదరగొడుతున్నాడు అని చెప్పాలి. అయితే సాదాసీదా ఆటగాడిగా కూడా అటు హార్థిక్ మంచి ప్రదర్శన చేశాడు. బౌలింగ్లో బ్యాటింగ్ లో కూడా బాగా రాణిస్తూ ఉన్నాడు.
హార్దిక్ పాండ్యా అద్భుతమైన ఫామ్ గురించి మాజీ ఆటగాడు ఇర్ఫాన్ పఠాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీమ్ ఇండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా ఫామ్ లోకి వస్తే అతని ఎవరు ఆపలేరు అంటూ వ్యాఖ్యానించాడు. అతడి ఆట చూస్తే గ్రౌండ్లో టెన్నిస్ ఆడుతున్నాడా అని భావన కలుగుతూ ఉంటుంది. పాండ్యా లాంటి ప్లేయర్ చాలా అరుదుగా ఉంటారు అంటూ చెప్పుకొచ్చాడు. ఇటీవల కాలంలో బౌలింగ్ లో కూడా మరింత మెరుగయ్యాడని.. ఇక న్యూజిలాండ్తో మూడో వన్డేలో సరైన సమయంలో ఫాస్ట్ గా రన్స్ చేసి జట్టును గెలిపించాడు అంటూ ప్రశంసలు కురిపించాడు.