గత కొంతకాలం నుంచి సాంప్రదాయమైన క్రికెట్ గా పిలుచుకునే టెస్ట్ ఫార్ముట్ లో విరాట్ కోహ్లీ పేలవమైన ఫామ్ కొనసాగుతూ వస్తుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇక విరాట్ కోహ్లీ లాంటి అత్యుత్తమ ఆటగాడు కూడా తీవ్రస్థాయిలో విమర్శలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే మొన్నటికి మొన్న ఆస్ట్రేలియా తో జరిగిన బోర్డర్ గావాస్కర్ ట్రోఫీలో కూడా విరాట్ ఇలాగే వరుస వైఫల్యాలతో తీవ్రస్థాయిలో విమర్శలు ఎదుర్కొన్నాడు.


 వరుసగా మూడు మ్యాచ్ లలో కూడా కోహ్లీ ఎక్కడ చెప్పుకో దగ్గ ప్రదర్శన చేయలేదు. ఇలా స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేక అటు టీమిండియా కు మైనస్ గా మారిపోతున్న విరాట్ కోహ్లీపై అటు ఆస్ట్రేలియా మాజీలు సైతం కాస్త ఘాటుగానే విమర్శలు చేశారు. ఇక ఇలా విమర్శలు చేసిన వారిలో ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు మార్క్ వా కూడా ఉన్నాడు అని చెప్పాలి. అయితే ఇక తనపై వస్తున్న విమర్శలను తన బ్యాట్ తోనే తిప్పికొట్టాడు విరాట్ కోహ్లీ. చివరి టెస్ట్ మ్యాచ్లు 186 పరుగులతో కదం తొక్కాడు. భారత జట్టు బాగా రాణించడంలో ఇక విరాట్ కోహ్లీదే కీలకపాత్ర అని చెప్పాలి. అయితే మొన్న విరాట్ కోహ్లీని  విమర్శించిన ఆస్ట్రేలియా మాజీ మార్క్ వా ఇప్పుడు ప్రశంసలు కురిపించాడు.


 చివరి టెస్ట్ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ సెంచరీ చేయడాన్ని అభినందించాడు మార్క్ వా. విరాట్ కోహ్లీ మరోసారి తన క్లాస్ ఏంటో చూపించాడు అంటూ ప్రశంసలు కురిపించాడు. చాలా నిలకడగా జాగ్రత్తగా ఆడుతూ కోహ్లీ పరుగులు రాబట్టాడు అంటూ మార్క్ వా కామెంట్ చేశాడు. అయితే ఇది అతని టాప్ ఫామ్ అని నేను అనుకోవడం లేదు అంటూ తెలిపాడు. కాగా తొలి మ్యాచ్లో కోహ్లీ ఈజీ క్యాచ్ డ్రాప్ చేయడంపై మార్క్ వా విమర్శలు చేశాడు అన్నది తెలిసిందే. ఇకపోతే ఈనెల 17వ తేదీ నుంచి ఆస్ట్రేలియా భారత్ మధ్య వన్డే సిరీస్ జరగబోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: