ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్లో యాక్టివ్ గా ఉన్న ప్లేయర్స్ అందరూ కూడా అటు ఐపీఎల్ లో కూడా భాగం అయ్యారు అన్న విషయం తెలిసిందే. అయితే ఇలాంటి ప్లేయర్లు మంచి ప్రదర్శన చేస్తారు అనుకుంటే.. ఇద్దరు, ముగ్గురు తప్ప మిగతా ప్లేయర్స్ అందరూ కూడా చెత్త ప్రదర్శనతో నిరాశపరిచారు అని చెప్పాలి. ఇలా స్టార్ ప్లేయర్స్ అందరూ కూడా వరుస వైఫల్యాలతో ఇబ్బంది పడుతున్న సమయంలో.. యంగ్ ప్లేయర్స్ మాత్రం తమలో దాగి ఉన్న సత్తాను నిరూపించుకున్నారు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. అదే సమయంలో అటు కెరియర్ ముగిసిపోతుంది అనుకుంటున్న సమయంలో ఐపీఎల్ ఛాన్స్ దక్కించుకున్న సీనియర్ ప్లేయర్స్.. సైతం మరోసారి తమ ప్రదర్శనతో ఆకట్టుకున్నారు.



 ఇలా ఐపిఎల్ లో వచ్చిన ఫ్యాన్స్ ని వినియోగించుకొని.. అదరగొట్టిన సీనియర్ క్రికెటర్లలో ముంబై ఇండియన్స్ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న పియూస్ చావ్లా కూడా ఒకరు అని చెప్పాలి. ఒకప్పుడు భారత జట్టు తరఫున ఎన్నో మ్యాచ్ లలో ఆడిన పీయూష్ చావ్లా  తన స్పిన్ బౌలింగ్ తో ఎన్నోసార్లు కీలక సమయంలో వికెట్లు పడగొట్టి జట్టు విజయంలో ముఖ్యపాత్ర వహించాడు. అయితే ఇక సీనియర్ క్రికెటర్ కావడంతో అతనికి భారత జట్టులో ఛాన్స్ లేకుండా పోయింది. కాగా  ముంబై అతనిపై నమ్మకం నుంచి జట్టులోకి తీసుకుంది. ఇక అతను జట్టు యాజమాన్యం నమ్మకాన్ని నిలబెట్టాడు.


 తన స్పిన్ బౌలింగ్ తో  అదరగొట్టాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇటీవల చాహల్ రికార్డును సమం చేశాడు చావ్లా. అత్యధిక సార్లు స్టంపింగ్ ద్వారా వికెట్లు తీసిన వారిలో అమిత్ మిశ్రా 28 వికెట్లతో తొలి స్థానంలో ఉన్నాడు. అయితే రెండవ స్థానంలో 19 వికెట్లతో చాహాల్ ఉన్నాడు. ఇక ఇటీవల పియూస్ చావ్లా సాహను స్టంపింగ్ ద్వారా అవుట్ చేయడంతో చాహల్ 19 స్టంపింగ్ అవుట్ ల రికార్డును సమం చేశాడు అని చెప్పాలి. ఈ లిస్టులో 18 స్టంపింగ్  వికెట్లతో హర్భజన్ మూడవ స్థానంలో ఉన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl