పేరుకే ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ కానీ చంద్రబాబునాయుడు వ్యక్తిత్వం మరీ అధమస్ధాయికి దిగజారిపోయిందనే చెప్పాలి. తాను అధికారంలో ఉంటే ప్రతిపక్షాలను లెక్క చేయడు. వ్యవస్ధలను పట్టించుకోడు.  ఎవరేమనుకున్నా తనకు అనవసరం అన్న పద్దతిలో తాను ఏమనుకుంటే దాన్నే అమలు చేస్తాడన్న విషయం మొన్నటి పాలనతోనే అందరికీ అర్ధమైపోయింది. పరిపాలన కూడా కేవలం కొంతమంది ప్రయోజనాల కోసమే అన్న విషయం కూడా రుజువైపోయింది. అందుకనే చంద్రబాబు పాలనను భరించలేక జనాలు టిడిపి గూబగుయ్యిమనిపించారు.

 

సరే ప్రతిపక్షంలోకి వచ్చాడు కదా ఏదో ఆచరణాత్మకమైన సలహాలు ఇస్తాడని అనుకుంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పై ఒకటే ఏడుపు. జగన్ కు పరిపాలన చేతకాదు. జగన్ కు అనుభవం లేదు. జగన్ ది ఫ్యాక్షన్ మనస్తత్వం లాంటి ఏడుపులతోనే పదినెలలు గడిపేశాడు. చంద్రబాబు ఏమనుకున్నా జగన్ మాత్రం తన మానాన తాను పనిచేసుకుపోతున్నాడు. దాంతోనే చంద్రబాబుకు ఇరిటేషన్ వచ్చేస్తోంది. అందుకే ప్రతిరోజు రెచ్చిపోయి ఆరోపణలు చేయటమే కాకుండా పచ్చమీడియాతో కూడా వరసబెట్టి కథనాలు రాయిస్తున్నాడు.

 

మొత్తానికి తన  మానసిక పరిస్ధితి మీదే జనాలు అనుమానపడేలా చంద్రబాబు వ్యవహరిస్తున్నాడు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే అధికారంలో వున్నా ప్రతిపక్షంలో ఉన్నా తన మాటే చెల్లుబాటు కావాలన్న పంతంతోనే రాజకీయాలు చేస్తున్నాడు. ఇక్కడే చంద్రబాబు ఆలొచనలతో జనాలు ఆశ్చర్యపోతున్నారు. అధికారంలో ఉన్నపుడు ఎలాగూ తన మాటే నెగ్గించుకుంటాడు. మరి ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత కూడా తన మాట ఎలా చెల్లుబాటవ్వాలని కోరుకుంటున్నాడో జనాలకు అర్ధం కావటం లేదు.

 

తాజాగా కరోనా వైరస్ వ్యవహారంలో చంద్రబాబు మాటలతోనే అందరూ ఆశ్చర్యపోతున్నారు. వైరస్ వ్యాప్తి నియంత్రణ విషయంలో జగన్ తన సలహాలు ఎందుకు తీసుకోవటం లేదు ? కచ్చితంగా తనతో మాట్లాడాల్సిందే అన్నట్లుగా ఉంది చంద్రబాబు మాటలు. అసలు తన సలహాలు ఎందుకు తీసుకోవాలో, తన మాటలు ఎందుకు వినాలో  చంద్రబాబు చెప్పలేకపోతున్నాడు.  ఉన్నంతలో జగన్ వైరస్ నియంత్రణకు బాగానే చేస్తున్నాడు. అందుబాటులో ఉన్న అన్నీ వనరులను సమర్ధవంతంగానే ఉపయోగించుకుంటున్నాడు. ఇదే చంద్రబాబులో బాధను పెంచేస్తోంది.

 

ఇంతపెద్ద సంక్షోభం సమయంలో తన సలహాలు లేకుండా తన ప్రమేయం లేకుండా జగన్ ఒక్కడే ఎదుర్కొంటున్నాడనే బాధే కనబడుతోంది చంద్రబాబు మాటల్లో. మొత్తానికి ఉండటానికి ఫార్టీ ఇయర్స్ అనుభవం ఉన్నా  ఆ అనుభవం చెప్పుకోవటానికి తప్ప ఇంక దేనికి పనికిరాదన్న విషయాన్ని చంద్రబాబు గ్రహిస్తున్నట్లు లేదు. కనీసం పార్టీ నేతల్లో ఎవరైనా చెబితే బాగుండును ఆ విషయాన్ని.

మరింత సమాచారం తెలుసుకోండి: