రామ్ గోపాల్ వర్మ ! ఈ పేరుని వెతుక్కుంటూ వివాదాలు రావు. కానీ వివాదాలను ఆయన వెతుక్కుంటూ వెళ్తుంటారు. తిక్కలోడు.... మెంటలోడు... వెర్రోడు ఇలా ఎన్ని రకాలుగా ఆయనను పిలిచినా, సరిగ్గా సూట్ అయిపోతుంటారు. ఆయన మనస్తత్వానికి తగ్గట్టుగానే ఆయన తీసిన, తీస్తున్న సినిమాలు అదే విధంగా ఉంటాయి. ఎందుకు తీస్తున్నారో ? ఎవరి కోసం తీస్తున్నారో ? సమాజానికి ఏ సందేశం ఇవ్వాలని అనుకుంటున్నారో ఎవరికీ తెలియదు. అసలు ఆయన ఎప్పుడు ఏ విధంగా వ్యవహరిస్తారో ఆయనకే తెలియదు. అసలు ఆయనకు కావాల్సింది కూడా కాంట్రవర్సి. అసలు ఆ మహానుభావుడు గురించి చెప్పుకోవాలంటే రోజులు కాదు నెలలు సమయం పడుతుంది.
ఇక సెంటిమెంట్లు ఆయింట్మెంట్లు తనకి ఏమీ ఉండవని ఎప్పుడు గొప్పగా చెప్పుకునే
వర్మ ఇప్పుడు ఆ సెంటిమెంట్ ని పక్కన పెట్టి, ఫ్యామిలీ సెంటిమెంట్ ప్రదర్శిస్తూ, సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ వైరల్ అవుతుంది. వార్నీ వర్మ...? నీలో యాంగిల్ కూడా ఉందా ? ఓరి నీ యాసాలు అనుకుంటూ సెటైర్లు వేస్తున్నారు.
వర్మ చేసిన ఘనకార్యం ఏంటయ్యా అంటే...? తన కుటుంబ సభ్యులతో కలిసి దీపావళిని జరుపు కోవడమే కాకుండా , దానిని సోషల్ మీడియాలో పెట్టి మరి తన ఆనందాన్ని, తన వంట్లో ఉన్న
కామెడీ యాంగిల్ ను పంచుకున్నాడు. అందులో ఏముంది అంటే తన తల్లి సోదరి తో కలిసి ఇంటి ముందు ఆనందంగా టపాసులు కాల్చడం, అది పేలుతున్న సందర్భంలో తల్లి చాటుకు వెళ్ళి దాక్కోవడం వంటి సన్నివేశాలు ఎన్నో చోటు చేసుకున్నాయి.
దీనిపై ఆయన ఒక సందేశాన్ని కూడా ఇచ్చాడు. " నేను సహజంగా చాలా పిరికి వాడిని. అందుకే తల్లి వెనుకన దాక్కున్నాను అంటూ
కామెడీ చేశాడు.అంతేనా అంటే ...? అంతే అయితే అతడు
వర్మ ఎందుకు అవుతాడు ? ''
దీపావళి సందర్భంగా వోడ్కా రుచి చూడమని నా తల్లి సోదరిని ఒప్పించే ప్రయత్నం చేస్తున్నా, అంటూ
వర్మ పోస్ట్ పెట్టి తాను ఎంత తిక్కలోడినో నిరూపించుకున్నాడు.