2019 ఎన్నికల నాటికి అయినా సొంతంగా బలం పెంచుకున్నారా అంటే అదీ లేదు. చివరకు ఎన్నికల్లో పోటీ చేస్తే అసలు బలం ఎంత అనేది తేలలేదు. ఇలా అయితే లాభం లేదని, బీజేపీతో పొత్తు పెట్టుకుని ముందుకు వెళ్తుండగా , ఇప్పుడు అదే
బిజెపి తరచూ అవమానాలకు గురి చేస్తూ, జనసేన
పార్టీ బలం పెంచుకోకుండా వ్యూహాలు రచిస్తూ, వస్తుండడం నిజంగానే మంట పుట్టిస్తోంది. కాకపోతే ఆ మంటను బయటకి కనిపించేలా చేస్తే మరింత భగ భగ మండుతుంది అనే ఉద్దేశంతో ఆ మంట ని తట్టుకుంటూ వస్తున్నారు. ఆ మధ్య జరిగిన గ్రేటర్ ఎన్నికలలో పోటీ చేద్దామని ఉత్సాహంగా అభ్యర్థులను ప్రకటించినా,
బిజెపి ఆ ఆశలపై నీళ్లు చిమ్మేసింది.
పోనీ ఆ త్యాగానికి ప్రతిఫలంగా
తిరుపతి లో పోటీ చేసే అవకాశం ఇస్తారని చూసినా, చివరకు ఇక్కడ కూడా మేము పోటీ చేస్తాం...మళ్లీ ఎప్పటిలాగే మాకు మీరు మద్దతు ఇవ్వండి అన్నట్లుగా
బిజెపి తమ వైఖరిని బయట పెట్టడం తో, మళ్ళీ ఎప్పటిలాగే జనసేనాని మళ్ళీ సైలెంట్ అయిపోయారు. ఇవన్నీ
జనసేన కు
పవన్ కు సర్వ సాధారణం అయిపోయాయి.