పార్టీ అధికారంలో ఉంటే మాకేంటి ? లేకపోతే మాకేంటి మాకు కావాల్సింది వివాదాలు ,
పార్టీ పదవులు అంతే తప్ప తమకు ఏమి సంబంధం లేదన్నట్లుగా వ్యవహరిస్తూ, ఎప్పుడూ ఉండే గ్రూపు రాజకీయాలకు కుమ్ములాట లకు పాల్పడుతూ ... పార్టీకి ఉన్న కాస్తో కూస్తో పేరును చెడగొట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం పిసిసి అధ్యక్ష పదవి విషయంలో
కాంగ్రెస్ లో జరుగుతున్న లొల్లి జనాలకు సిల్లిగానూ, చీఫ్ గాను కనిపిస్తోంది.
తెలంగాణ పిసిసి అధ్యక్షుడిగా ఆ
రేవంత్ కో మరొకరితో పదవి కట్టబెట్టేందుకు
కాంగ్రెస్ అధిష్టానం సిద్ధమవుతుండగా , అబ్బే ఆ
రేవంత్ కు కనుక పదవి ఇస్తే తాను పార్టీలో ఉండను అంటూ... రిటైర్మెంట్ వయసు దాటిపోయి పార్టీకి పెద్దగా ఉపయోగపడని ప్రజల్లో బలం లేని నాయకుడు స్టేట్మెంట్ ఇచ్చి మరి హడావుడి చేస్తున్నారు. అసలు ఆయన ఉన్న డివిజన్ లోనే సొంతంగా గెలవలేని ఆయన తనకే పిసిసి అధ్యక్ష పదవి ఇవ్వాలంటూ మారాం చేస్తున్నాడు.
వార్ని... ఈ వయసులో పదవులు కావాలా తాత ..? ఇంట్లో కూర్చోక అంటూ సోషల్
మీడియా లోనూ సెటైర్లు పడుతున్నాయి.
రేవంత్ బలం ఎంత నీ బలం ఎంత ? నీకు పదవి కావాలా తాత అంటూ పదే పదే సెటైర్లు వేస్తున్నా .. అదంతా నాకు తెల్వధి.. నాకే పదవి షురూ చెయ్యలే...? అంటూ హడావుడి చేసేస్తున్నాడు. అమ్మో ఈ తాత మామూలు తాత కాదు.
రాహుల్ గాంధీ నే కాదు
రాజీవ్ గాంధీ తోనూ ఫ్రెండ్షిప్ చేసిన తాత.