పురాణాల కాలం నాటి నుండి నేటి ఆధునిక యుగం వరకు మన దేశంలో మహిళలంటే చాలా మందికి చిన్నచూపు ఉంది. శారీరకంగా, మానసికంగా వారు చాలా వీక్ గా ఉంటారనే చెడు అభిప్రాయం చాలా మందిలో బలంగా నాటుకుపోయింది. మీకు కూడా ఇలాంటి అభిప్రాయం ఉంటే వెంటనే దాన్ని మార్చుకోండి. ఎందుకంటే మీరు ఊహించిన విషయాల కంటే మహిళలు చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు. ముఖ్యంగా అన్ని రంగాల్లో తమ శక్తి సామర్థ్యాలను చూపుతున్నారు.