గృహ్య సూత్రాలనేవి మానవుని జీవితంలో చాలా ముఖ్యమైనవిగా పురాణాలు వేదాలలో చెప్పబడినవి. ఇవి ప్రధానముగా గృహస్థులు ఆచరించాల్సిన ధర్మాలనూ, సంస్కారాలనూ వివరిస్తాయి. ఇవి ఇంట్లో చేయవలసిన కర్మలు. ఇవి వాటిని రచించిన ఋషులపేర్లమీద ప్రాచుర్యం పొందాయి. వీటిలో బోధాయన, ఆపస్తంభ, కాత్యాయనమొదలగు తొమ్మిది గృహ్యసూత్రాలు ప్రాచీనమైనవి.