హోలీ పండుగ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఎందుకంటే ఈ హోలీ పండుగ కోసం చిన్న పిల్లల నుండి పెద్దవారి వరుకు ప్రతి ఒక్కరు సంవత్సరం ఎదురు చూస్తారు. అంత బాగుంటుంది ఈ హోలీ పండుగ. కుల మాత పేద ధనిక వంటి భేదాలు లేని ఈ పండుగను వివిధ రాష్ట్రాల్లో.. అద్భుతంగా చేసుకుంటారు. అయితే అది ఎలా అనేది ఇక్కడ చదివి తెలుసుకోండి.  

 

మథురలో హోలీ..

 

శ్రీ కృష్ణుడి జన్మ స్థలం అయిన మథురలో, బృందావనంలో హోలీ పండుగ వేడుకలు అంబరాన్ని అంటుతాయి అనడంలో సందేహం లెదు. అక్కడ హోలీ పండుగను ఏకంగా 16 రోజుల పాటు జరుపుకుంటారు. సంప్రదాయ పద్ధతులలో ఆచార వ్యవహారాలతో తమ ఇష్టదైవమైన శ్రీ కృషుడికి ప్రత్యేకమైన పూజలు చేసి ఈ హోలీ పండుగను ఘనంగా జరుపుకుంటారు. ఈ హోలీ పండుగ కోసం దేశవిదేశాల నుండి ప్రజలు మథురైకి వస్తారు. 

 

ఒరిస్సాలో హోలీ... 

 

ఒరిస్సాలోని జగన్నాథ, పూరీ ఆలయాలలో శ్రీకృష్ణుడు, రాధ విగ్రహాలు ఉంచి ప్రత్యేక పూజలు జరిపించి ఆ తరువాత హోలీ వేడుకలు ఘనంగా ప్రారంభిస్తారు.

 

గుజరాత్... 

 

గుజరాత్ లో ఈ పండగను అత్యంత ఘనంగా జరుపుతారు. చెడు మీద మంచి సాధించిన విజయానికి గుర్తుగా మంటలు వేసి దాని చుట్టూ చేరి డ్యాన్స్ వేస్తూ.. పాటలు పాడుతూ సంబరాలు చేసుకుంటారు.. అంతేకాదు మనం ఇక్కడ ఎలా అయితే బోగి జరుపుకున్న సమయంలో ఇంట్లోని పాత చెక్కసామానులన్నీ తీసుకొచ్చి అందులో వేస్తారో అచ్చం అలానే అక్కడ కూడా చేస్తారు.. హోలీ పండుగను ఘనంగా నిర్వహిస్తున్నారు. 

 

మహారాష్ట్ర.. 

 

హోళీ వేడుకకు ఒక వారం ముందు యవకులు ఇంటింటికి తిరిగి పాత చెక్క సామానులు సేకరించి పెద్ద ఎత్తున మంటలు వేస్తారు... అవి ఉదయం నుండి సాయింత్రం వరుకు మండుతూనే ఉంటాయి. ఈ మంటలకు కోసం ప్రత్యేకంగా పిండి వంటలు చేసి వాటిని నైవేద్యంగా సమర్పిస్తారు. మహారాష్ట్రలో హోళీక దిష్టిబొమ్మను దహనం చేస్తారు. 

 

మణిపూర్..

 

మణిపూర్ లో అయితే అత్యంత అద్భుతంగా హోలీ వేడుకలు జరుపుతారు. వారం రోజుల పాటు ఈ హోలీ వేడుకలను అక్కడ జరుపుతారు.. అంతేకాదు.. అక్కడ ఓ వింత ఆచారం కూడా ఉంది. అది ఏంటి అంటే ఆడపిల్లలకు మగపిల్లలు డబ్బులు ఇస్తేనే వారిపై రంగులు చల్లాలి. లేదు అంటే చల్లకూడదు. అక్కడ చివరిరోజు కృష్ణుడి ఆలయం వరకు ఊరేగింపు నిర్వహిస్తారు. 

 

కాశ్మీర్.. 

 

సైనికుల పహారాలో, తుపాకుల చప్పళ్ళతో ఉద్రిక్తంగా ఉండే అందాల కాశ్మీర్ లో సైనికులతో సహా అందరూ హోళీ ఉత్సవాలలో పాల్గొంటారు. ఆటపాటలతో రంగు నీటిని ఒకరిమీద మరొకరు చల్లుకొని ఘనంగా చేస్తారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: