కాలాన్ని బట్టి పంటల మార్పిడి చేసుకోవాలని మేము కూడా చెబుతున్నాం అని ఆయన వివరించారు. వ్యవసాయాన్ని కేంద్రం కబంధ హస్తాల్లోకి తీసుకుంది అని మండిపడ్డారు. పంటల మార్పిడికి ప్రోత్సాహకాలు ఎందుకు ప్రకటించటం లేదు అని నిలదీశారు. కేంద్రం ఏం విధులు నిర్వహిస్తుందో రాష్ట్ర బిజెపి నేతలకు తెలియదు అని అన్నారు. రైతులతో పెట్టుకున్న వాళ్ళు బతికిబట్ట కట్టిన చరిత్ర లేదు అన్నారు మంత్రి. దక్షిణ భారతదేశ రైతులు కేంద్ర ప్రభుత్వం మీద తిరగపడే పరిస్థితి తెచ్చుకోవద్దు అని హెచ్చరించారు.
యాసంగి వడ్లు కొంటారా..లేదా చెప్పండి అంటూ డిమాండ్ చేసారు. రాష్ట్ర బిజెపి నేతలకు దమ్ముంటే ఉత్తర కుమార మాటలు బంద్ పెట్టి ఉత్తర్వులు తీసుకురావాలి అని కోరారు. సీఎం కేసీఆర్ త్వరలోనే రాష్ట్ర కార్యవర్గం,ఎమ్మేల్యేలు, ఎంపీలతో చర్చిస్తారు అని అన్నారు. భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తారు అని అన్నారు. క్యాబినెట్ లో రైతు సమస్యలే కీలక అంశంగా చర్చిస్తారు అని చెప్పిన ఆయన వ్యవసాయ నల్ల చట్టాలకు కాంగ్రెస్ ఏ ప్రణాళిక లు సిద్ధం చేసింది..బీజేపీ ఆ ట్రాప్ లో పడింది అన్నారు. సొల్లు కబుర్లు తప్ప ఏమీ మాట్లాడుతాలేరు అని విమర్శించారు. గతంలో ప్రధాన మంత్రి గుజరాత్ ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడు 51 గంటల దీక్ష చేశారు అని గుర్తు చేసారు.
            
                            
                                    
                                            
 క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి