ఆచార్య చాణక్యుని గురించి మనందరికీ తెలిసిన విషయమే. ఆయన రాజగురువుగా ఎంతో ప్రాముఖ్యత పొందాడు. ఆయన పురుషుల గురించి కొన్ని విషయాలు ఎవరితో చెప్పకూడదు అని చెప్పాడు. మరి అవి ఏ విషయాలు ఎందుకు ఇతరులతో చెప్పకూడదో  తెలుసుకుందామా..? ఆచార్య చాణక్యుని గురించి స్కూల్  విద్యార్థులను అడిగినా చెప్పేస్తారు. రాజకీయ  చాతుర్యంలో ఆయనను మించినవారు లేరనే చెప్పవచ్చు.  క్రీస్తుపూర్వం 380 నుంచి 253 వరకు ఆయన జీవిత కాలం కొనసాగింది.

 ఆ సమయంలో ఆయన మంచి సలహాదారుడిగా వ్యూహకర్తగా రచయితగా రాజకీయ నీతిని అవపోసన పట్టిన నిపుణుడిగా చాలా పేరుగాంచాడు. ఆయన చెప్పిన వ్యూహాలు  ప్రస్తుత ప్రజలు పాటిస్తే ఎలాంటి పరిస్థితులు అయినా మనం అధిరోహించే శక్తి వస్తుంది. మగవారు ఎప్పుడైనా ఆర్థిక సంబంధమైన సమస్యలతో కొట్టుమిట్టాడుతుంటే వాటి గురించి ఇతరులతో అస్సలు చెప్పకూడదని చాణిక్యుడు  చెప్పాడు. ఒకవేళ డబ్బులు పోయినా సరే ఆ విషయాన్ని ఇతరులకు అస్సలు తెలియనివ్వకూడదని ఎందుకంటే ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడే వారి గురించి ఇతరులకు తెలిస్తే వారికి ఎవరు సహాయం చేయరు. పై పైన ఎవరైనా సహాయం చేద్దామని ముందుకు వచ్చిన అది నిజమైన సహాయం కాదు. వ్యక్తిగత సమస్యల గురించి కూడా ఇతరులకు తెలియ నివ్వ కూడదు. అలా తెలిస్తే బయట వ్యక్తులు వాటిపై అపహాస్యం చేస్తూ,ఆ సమస్య పై జోకులు వేసుకుంటూ మరింత విసుగు వచ్చేలా చేస్తూ ఉంటారు. ఈ సందర్భంలో సమస్యతో బాధపడుతుంటే ఇంకా వారి మాటలు మిమ్మల్ని ఆత్మనూన్యతకు గురిచేస్తాయి. ఒక వ్యక్తి తన భార్య గురించి ఏ విషయాన్ని అయినా సరే ఇతరులతో చెప్పాకూడదు. అది ఏదైనా సరే రహస్యంగానే ఉంచాలి.

ఒకవేళ అలా చేయకపోతే అది భవిష్యత్తులో ఇబ్బందులకు గురి చేసే అవకాశం ఉంటుంది. భార్య గురించి రహస్యాలు ఇతరులతో అస్సలు పంచుకో రాదు. ఒక వ్యక్తి ఎప్పుడైనా ఎక్కడైనా అవమానానికి గురైతే వీలైనంత త్వరలో దాన్ని మర్చిపోవాలి. ఆ విషయం గురించి ఇతరులకు అస్సలు తెలియనివ్వకూడదు. అలా చేయడం వల్ల దానిపై వారు చులకన చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు  వారి మనోభావాలు దెబ్బ తిని మానసికంగా కృంగదీస్తుంది. ఈ యొక్క నాలుగు విషయాలను పురుషుల ఎవరితోనూ షేర్ చేసుకోకుండా ఉంటే బాగుంటుందని చాణిక్యుడు   తెలియజేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: