హిందువులకు సైతం ఎక్కువగా పండుగలు జరుపుకుంటూ చాలా పవిత్రంగా చేసుకుంటూ ఉంటారు. అలాంటి వాటిలో నవరాత్రి కూడా ఒకటి.. ఈ ఉత్సవాలు దాదాపుగా తొమ్మిది రోజులపాటు భక్తిశ్రద్ధలతో చేస్తూ ఉంటారు. అమ్మవారికి శాస్త్రం ప్రకారమే పూజలు చేస్తూ నైవేద్యాలను సమర్పిస్తూ ఏకంగా తొమ్మిది రోజులపాటు దేవాలయాలలో లేదా ఇంటిలో దీపాన్ని వెలిగించడం శుభప్రదంగా తీసుకుంటూ ఉంటారు హిందువులు దీపం వెలిగించడం వల్ల ఆ ఇల్లు సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉంటుందని నవరాత్రి ఉత్సవాలలో దుర్గాదేవికి నూనె దీపంతో వెలిగిస్తూ ఉంటారు. నెయ్యితో వెలిగిస్తే మరింత మంచి జరుగుతుందట.

శాస్త్రం ప్రకారం నవరాత్రులలో దుర్గమ్మ దేవికి నెయ్యి దీపం వెలిగించడం వల్ల అత్యంత శుభప్రదంగా పండితులు తెలియజేస్తున్నారు.కావాలంటే నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించవచ్చు. కానీ దేవుడికి ఏ నూనెతో వెలిగించిన విగ్రహానికి ఏ వైపున దీపం ఉంచాలో అనే విషయం తెలియడం చాలా ముఖ్యము.. నువ్వుల నూనెతో వెలిగిస్తే అమ్మవారికి ఎడమవైపున ఉంచాలి లేకపోతే కుడివైపున ఉంచడం కూడా మంచిదే.



దీపం వెలిగించేటప్పుడు నవరాత్రులలో నెయ్యి దీపాన్ని నిలువుగా ఒత్తి ఉంచి వెలిగించాలి నువ్వుల దీపాన్ని ఎరుపు మట్టి పుంతలో  నిలువు వత్తి ఉంచాలని గుర్తించుకోవాలి. దీపం పెట్టే మట్టి కుండ ఎక్కడ కూడా పగిలిపోకూడదు.. ఎందుకంటే పూజలు మురికిగా ఉన్న లేదా విరిగిన దీపాలన వెలిగించడం చాలా అశుభ్రంగా పరిగణిస్తారు.

మన శాస్త్రం ప్రకారం దీపాన్ని ఎప్పుడు కూడా ఆగ్నేయ మూలనే ఉంచాలి. నవరాత్రులలో అమ్మవారికి దీపం వెలిగించేటప్పుడు ఎన్నో నియమ నిబంధనలతో వెలిగించాలి.. దశవిధాలైన పాపాలను హరించింది కనుక  దశహర అనే పదం రాగ ఈ పదముని వాడుకగా దసరాగా పిలుస్తూ ఉన్నారు ఈ ఏడాది శరవన్న రాత్రి ఉత్సవాలు అక్టోబర్ 15 నుంచి ప్రారంభమయ్యాయి. ఈనెల 26 వరకు జరగబోతున్నాయి. ఎవరైతే ఈ నవరాత్రులలో అమ్మవారికి దీపాన్ని వెలిగించాలనుకుంటారో వారు కచ్చితంగా ఇవన్నీ పాటించడం చాలా మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి: