
కామవరపుకోట మండలంలోని పాతూరు వాలీసుగ్రీవుల గట్టు సమీపంలో శతాబ్దాల చరిత్ర కలిగిన గుడ్లగురవమ్మ ఆలయంలో ఆదివారం నాడు ఆషాడమాసం సందర్భంగా నిర్వహించిన సారె వేడుకలు ఎంతో వైభవంగా, భక్తిశ్రద్ధలతో సాగాయి. గ్రామీణ మహిళల ఆదరణతో, పల్లె సంస్కృతిని ప్రతిబింబించే ఈ వేడుక పాతూరుతో పాటు పరిసర గ్రామాలవారికీ ఆధ్యాత్మిక మహోత్సవంగా జరిగింది. ఉదయం పాతూరు రామాయలంలో గణపతి పూజలతో కార్యక్రమం మొదలైంది. అనంతరం గ్రామ మహిళలు సంప్రదాయ మేళతాళాలు, సన్నాయి వాయిద్యాలతో అమ్మవారి సారెను ఊరేగింపుగా ఆలయానికి తీసుకెళ్లారు. ఆ ఊరేగింపులో కళాత్మకత, భక్తిశ్రద్ధలు మేళవించి, పల్లె ప్రజల భక్తి భావనకు నిదర్శనంగా నిలిచింది.
అమ్మవారికి మహిళా భక్తులు పసుపు, కుంకుమ, గాజులు, పండ్లు, స్వీట్లు, పిండివంటలు అర్పించారు. ఈ సారె, పూజా సామగ్రిని గుడ్లగురవమ్మకి నివేదించారు. భక్తులు తమ కుటుంబ, గ్రామ క్షేమం కోసం అమ్మవారిని వేడుకున్నారు. సారె కార్యక్రమం లోక కల్యాణార్థం నిర్వహించినట్టు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. పూజల అనంతరం ఆలయ ఆవరణలో ప్రసాదాన్ని పెద్ద ఎత్తున పంపిణీ చేశారు. కార్యక్రమం ఎంతో ఆధ్యాత్మికంగా, చక్కని సామూహిక సంస్కృతిని ప్రతిబింబించేలా సాగింది. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు శ్రీనివాస లక్ష్మణాచార్యులు అమ్మవారికి విశిష్ట పూజలు నిర్వహించారు. సంప్రదాయ పద్ధతిలో హారతులు, అర్చనలు, మంగళహారతులతో పూజా కార్యక్రమం జరగింది. ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు ఈ ఉత్సవం కోసం ముందస్తుగా ఏర్పాట్లు చేసి, భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకున్నారు.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు