క్రికెట్లో సచిన్ టెండూల్కర్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రపంచంలోని దిగ్గజ ఆటగాళ్లలో మొదటి వరుసలో ఉంటారు సచిన్ టెండూల్కర్. అంతే  కాకుండా ఎంతో మంది నేటితరం క్రికెటర్లకు ఆదర్శప్రాయం గా ఉంటారు. అయితే సచిన్ టెండూల్కర్ క్రికెట్ కు వీడ్కోలు పలికినప్పటికీ... ఇప్పటికీ క్రికెట్ కి సంబంధించిన వాణిజ్య ప్రకటనల్లో కనిపిస్తూనే ఉంటారు. ఇదిలా ఉంటే తాజాగా ఆస్ట్రేలియాకు చెందిన ప్రముఖ బ్యాట్ల  తయారీ సంస్థ ప్రస్తుతం మాస్టర్ బ్లాస్టర్ సచిన్ ను  క్షమాపణలు కోరింది. ఇక ఈ క్షమాపణకు సచిన్ టెండూల్కర్ కూడా సానుకూలంగానే స్పందించాడు. 

 

 

 ఇంతకీ ఏం జరిగింది అంటారా... ఆస్ట్రేలియాకు చెందిన ప్రముఖ బ్యాట్ల  తయారీ సంస్థ అయిన స్పార్టన్  సచిన్ టెండూల్కర్కు క్షమాపణలు చెప్పింది... సచిన్ టెండూల్కర్కు బ్యాట్ల  తయారీ సంస్థకు మధ్య గత కొంతకాలంగా ఒప్పందం ఉల్లంఘన కు  సంబంధించి ఓ వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే. సదరు బట్టల తయారీ సంస్థ ఇచ్చిన మాట తప్పి ఒప్పందం ఉల్లంఘించింది  అంటూ న్యాయ పోరాటం చేస్తున్నారు సచిన్ . 2016 లో సచిన్ టెండూల్కర్ బ్యాట్  తయారీ సంస్థ అయిన స్పార్టన్  అనే కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా పనిచేశారు. ఇక బ్రాండ్ అంబాసిడర్ అంటే భారీ మొత్తంలో చెల్లింపులు జరపాల్సి ఉంటుంది. అయితే ఒప్పందం ప్రకారం ఎండార్స్మెంట్ ఫీజులను టెండూల్కర్కు చెల్లించలేక పోయింది సదరు స్పార్టన్  కంపెనీ. 

 

 

 అంతేకాకుండా ఒప్పందం ముగిసిన తర్వాత కూడా సచిన్ పేరును వాడుకొని ఒప్పందం ఉల్లంఘించింది  దీంతో తనకు 15.1 కోట్లు చెల్లించాలి  అంటూ సచిన్ న్యాయ పోరాటానికి దిగారు. గత సంవత్సరం ఈ విషయం పై కేసు కూడా వేశాడు సచిన్ టెండూల్కర్. తాజాగా ఇదే విషయమై ఇచ్చిన మాట తప్పినందుకు సచిన్ టెండూల్కర్ మమ్మల్ని మన్నించాలి... అంటూ ఆస్ట్రేలియాకి చెందిన బ్యాట్ల తయారీ సంస్థ స్పార్టన్ సచిన్ టెండూల్కర్ను క్షమాపణలు కోరింది. ఈ బ్యాట్  తయారీ సంస్థ సీవోవో లెస్ కాల్ బ్రెత్  సచిన్ టెండూల్కర్కు క్షమాపణలు కోరగా అందుకు సచిన్ టెండూల్కర్ కూడా సానుకూలంగా స్పందించారు.. దీంతో ఈ వివాదం కాస్త ఓ కొలిక్కి వచ్చినట్లయ్యింది . స్పాన్సర్షిప్ ఒప్పందాన్ని గౌరవించినందుకు  సచిన్ టెండూల్కర్కు మా హృదయ పూర్వక క్షమాపణలు... అత్యంత ఓపికగా ఈ వివాదాన్ని పరిష్కరించిన మీకు  కృతజ్ఞతలు అంటూ బాపట్ల తయారీ సంస్థ సీవోవో వ్యాఖ్యానించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: