టీమిండియా డేర్ అండ్ డాషింగ్ కెప్టెన్ విరాట్ కోహ్లీకి ప్రపంచ క్రికెట్ లో ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కేవలం భారత క్రికెట్ ప్రేక్షకుల లోనే కాదు ఇతర దేశాలలో కూడా విరాట్ కోహ్లీకి అభిమానులు ఉంటారు. కేవలం ఆట  విషయంలోనే కాదు విరాట్ కోహ్లీ ఫిట్నెస్ విషయంలో కూడా ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యధిక ఫిట్నెస్ కలిగిన ఆటగాళ్లలో విరాట్ కోహ్లీ అగ్రస్థానంలో నిలుస్తాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఆట పట్ల ఎంతో అంకితభావంతో ఉంటాడో ఫిట్నెస్ పట్ల కూడా అంతే అంకితభావాన్ని కనపరుస్తూ ఉంటాడు టీమ్ ఇండియా డేర్ అండ్ డాషింగ్ కెప్టెన్ విరాట్ కోహ్లీ.



 ఇక విరాట్ కోహ్లీ ఇప్పటికే ఎన్నో రికార్డులను కొల్లగొట్టి రికార్డుల రారాజు గా మారిపోయిన విషయం తెలిసిందే.  అంతే కాకుండా పరుగుల యంత్రంగా  కూడా మారిపోయాడు విరాట్ కోహ్లీ. కాగా విరాట్ కోహ్లీ ఆట ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తూ ఉంటుందని ఇప్పటికే ఎంతోమంది మాజీ క్రికెటర్లు ప్రశంసల వర్షం కురిపించారు అన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా ఎంతోమంది ఆస్ట్రేలియా మాజీ ఆటగాల్లు  సైతం విరాట్ కోహ్లీపై ప్రశంసలు కురిపిస్తున్నారు.



 తాజాగా విరాట్ కోహ్లీ పై ప్రశంసల వర్షం కురిపించారు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మార్క్ టేలర్. ప్రపంచంలోనే శక్తివంతమైన క్రికెటర్ విరాట్ కోహ్లీ అంటూ ప్రశంసించాడు. కోహ్లీ దూకుడు స్వభావం కల ఆటగాడు గానే కాకుండా ఆదర్శవంతమైన క్రికెటర్గా కూడా ఎంతో మంది యువ క్రికెటర్లకు నిలుస్తాడు అంటూ ఆయన పేర్కొన్నాడు. తన కర్తవ్యాలను అన్నింటినీ ఎంతో బాధ్యతగా నిర్వర్తిస్తాడు అంటూ కొనియాడారు. కోహ్లీ ఆట ఎప్పుడు సహజ సిద్ధంగా ఉంటుందని ఎప్పుడు ఆటను గౌరవిస్తూ ముందుకు సాగుతాడు అంటూ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: