అయితే 24 బంతుల్లో 42 చేసి మంచి దూకుడు మీద విరాట్ కోహ్లీ అంతలో వికెట్ కోల్పోయాడు.. ఇక ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన హార్దిక్ పాండ్య మరోసారి మెరుపులు మెరిపించారు. 22 బంతుల్లో 42 పరుగులు చేశాడు.. దీంతో టీమిండియా అలవోకగా విజయం సాధించింది. అయితే అద్భుతం గా రాణిస్తున్న శిఖర్ ధావన్ అవుట్ చేసే అవకాశాన్ని ఆస్ట్రేలియా వికెట్ కీపర్ మ్యాత్యూ వెడ్ చేజార్చాడు. కేవలం సెకండ్ల వ్యవధిలో శిఖర్ ధావన్ వికెట్ చేజార్చాడు. స్పిన్ బౌలింగ్ లో భారీ షాట్ ఆడబోయిన శిఖర్ ధావన్ బంతిని కీపర్ కు వదిలేసాడు. ఈ క్రమంలోనే క్రీజులో శిఖర్ ధావన్ కాలు మెల్లిగా పైకి లేచి పోతున్న తరుణంలో.. వికెట్ల వెనుక ఉన్న ఆస్ట్రేలియా కీపర్ మ్యాత్యూ వెడ్ వెంటనే బంతిని వికెట్లకు కొట్టేశాడు.
దీంతో భారీగా అప్పీల్ చేయడంతో ఫీల్డ్ ఎంపైర్లు ఈ నిర్ణయాన్ని థర్డ్ ఎంపైర్ కి ఇచ్చారు. థర్డ్ ఎంపైర్ రివ్యూ చూసి నాటౌట్గా ఇచ్చాడు. ఈ క్రమంలోనే ఆస్ట్రేలియా కీపర్ మ్యాత్యూ వెడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. నేను ధోని కాదు.. రెప్పపాటులో స్టంప్ అవుట్ చేయలేక పోయాను అంటూ నవ్వుతూ శిఖర్ ధావన్ తో వ్యాఖ్యానించాడు ఆస్ట్రేలియా వికెట్ కీపర్ మ్యాత్యూ వెడ్. దీంతో అటు శిఖర్ ధావన్ కూడా నవ్వుకున్నాడు. ఇక ప్రస్తుతం దీనికి సంబంధించిన సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ గా మారగా ధోని రెప్పపాటు లో వికెట్ చేయడాన్ని మరోసారి అభిమానులు అందరూ కూడా గుర్తు చేసుకుంటున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి