ప్రస్తుతం భారత యువ సంచలనం పృథ్వీషా తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొంటున్నాడు అన్న విషయం తెలిసిందే.  ఇటీవలే ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న భారత టెస్టు జట్టులో చోటు దక్కించుకున్న పృద్వి ష ఇక మొదటి టెస్టు మ్యాచ్ లో పేలవ ప్రదర్శన చేసి తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొంటున్నాడు. మొదటి ఇన్నింగ్స్ లో భాగంగా బ్యాటింగ్ చేసిన పృద్వి ష బాగా ఆడతాడు  అనుకుంటే ఒక్క పరుగు కూడా చేయకుండానే డకౌట్ అవ్వడం తో టీమిండియా అభిమానులు అందరూ షాక్ అయ్యారు.  ఇక అంతే కాకుండా ఫీల్డింగ్  లో కూడా పృథ్వీ షా అంతగా సత్తా చటక పోవడంతో తీవ్ర స్థాయిలో ట్రోల్స్ మొదలుపెట్టారు.



 ఇక రెండవ ఇన్నింగ్స్ లో కూడా మరోసారి పృద్వి షా  ఆడతాడు అని భావించినప్పటికీ ఇక రెండవ ఇన్నింగ్స్ లో కూడా అదే పంథా కొనసాగించి.. కేవలం నాలుగు పరుగుల కు మాత్రమే వికెట్ చేజార్చుకుని పేలవ ప్రదర్శన చేశాడు. దీంతో బ్యాటింగ్ ఎలాగూ రాదు ఫీల్డింగ్ కూడా రాదా..  ఎందుకు వస్తారు అయ్యా జట్టులోకి అంటూ ఎంతో మంది భారత జట్టు అభిమానులు పృద్వి షా ను  ట్రోల్ చేయడం ప్రారంభించారు. ఇక ఎంతోమంది పృద్వి షా ఆట తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించడం కూడా మొదలుపెట్టారు ఇలాంటి పరిణామాల నేపథ్యంలో ఇటీవల తనపై వస్తున్న విమర్శలపై స్పందించిన పృద్వి షా ఘాటుగా బదులిచ్చాడు.


 ఆస్ట్రేలియా  జట్టుతో జరిగిన తొలి టెస్టులో విఫలమైనప్పటికీ పృథ్వీషా రెండవ టెస్ట్ కోసం తుది జట్టులో ఎంపిక అవుతాడా లేదా అన్నది అనుమానంగా మారింది అనే విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే స్పందించిన పృథ్వీ షా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కొన్నిసార్లు మనం ఏదో ప్రయత్నిస్తూ ఉంటే జనాలు మనను నిరుత్సాహపరిచేందుకు ఎప్పుడూ ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు... దానర్థం వాళ్ళు చేయలేదని మనం చేస్తున్నామని అంటూ ఒక పోస్టు పెట్టగా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది అయితే తనపై వస్తున్న ట్రోల్స్ కు బదులు ఇస్తూనే ఈ పోస్టు పెట్టాడు అని ప్రస్తుతం పలువురు భావిస్తున్నారు ఏదేమైనా ప్రస్తుతం ఈ  పోస్ట్ కాస్త ఆసక్తికరంగా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: