ఇక ప్రతి ఒక్కరు ఇలా గూగుల్లో సెర్చ్ చేసి ఎంతో మంది సెలబ్రిటీలకు సంబంధించిన వివరాలు తెలుసుకుంటూ ఉంటారు. అయితే ఇటీవలే కొంతమంది వయస్సును గూగుల్లో తప్పుగా చూపిస్తుండడం లాంటి ఘటనలు వెలుగులోకి వచ్చాయి అన్న విషయం తెలిసిందే. ఇటీవలే టీమిండియా హెడ్ కోచ్ రావిశాస్త్రి వయస్సు కూడా తప్పుగా చూపించడంతో ఇది కాస్త హాట్ టాపిక్గా మారిపోయింది. రవిశాస్త్రి వయసును 120 ఏళ్లుగా గూగుల్ చూపించడంతో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది. దీనికి సంబంధించిన వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.
1990లో రవిశాస్త్రి జన్మించినట్లుగా గూగుల్ లో చూపెడుతుంది. ఇక రవిశాస్త్రి వయస్సు మాత్రమే కాదు ఆయన భార్య కూడా 1990లో పుట్టినట్లు గూగుల్లో సెర్చ్ చేస్తే వస్తుంది. ఇక ఇలా ఎంతో మంది గూగుల్ చూపెట్టిన రిజల్ట్ తో షాక్ అవుతున్నారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేయడంతో ఇది కాస్త వైరల్ గా మారిపోయింది. నిజానికి రవి శాస్త్రి 1962 మే 27వ తేదీన జన్మించాడు. అయితే ప్రస్తుతం గూగుల్లో రవిశాస్త్రి వయసు నూట ఇరవై ఏళ్లు అని చూపించడంలో దీని పై సోషల్ మీడియాలో ఎన్నోరకాల మీమ్స్ వస్తున్నాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి