ప్రస్తుతం టీమిండియా జట్టు ఇంగ్లండ్ పర్యటన లో ఉంది అన్న విషయం తెలిసిందే.  ఇంగ్లాండ్ పర్యటనలో భాగంగా టీమిండియా మొదటి వరల్డ్ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ ఆడింది. ఇక ఈ మ్యాచ్ లో విజయం సాధిస్తుందని అనుకున్నప్పటికి  భారత ప్రేక్షకులందరికీ నిరాశ ఎదురైంది. కాగా  ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా ఇంగ్లండ్ జట్టుతో ఐదు టెస్టుల సిరీస్ ఆడుతుంది భారత జట్టు. నేడు టెస్ట్ సిరీస్లో భాగంగా మొదటి టెస్ట్ మ్యాచ్ ప్రారంభం అయింది.  అయితే ఇక ఈ టెస్ట్ సిరీస్ లో ఎవరు విజయం సాధిస్తారు అన్నది ఆసక్తికరంగా మారిపోయింది.



 గత కొంత కాలం నుంచి టీమిండియాకు ఇంగ్లండ్ పర్యటనలో వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి అన్న విషయం తెలిసిందే.  ఇప్పటికే పలుమార్లు ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లిన టీం ఇండియాకు ఇక వరుస ఓటములు ఎదురయ్యాయి. దీంతో టీమిండియా అభిమానులు అందరూ కూడా నిరాశలో మునిగిపోయారు.  అయితే ఇప్పటికే ఇంగ్లండ్ పర్యటనలో పలు మార్లు ఎదురు దెబ్బలు తిన్న టీమిండియా.. ఈసారి తప్పక గెలుస్తుందని పలువురు క్రికెట్ విశ్లేషకుల అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పలువురు మాజీ క్రికెటర్లు కూడా ప్రస్తుతం ఇంగ్లాండ్ భారత్ మధ్య జరుగుతున్న ఐదు టెస్టుల సిరీస్ గురించి తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.



 ఇక ఇటీవలే భారత మాజీ క్రికెటర్.. క్రికెట్ ప్రెసెంటెటర్  సునీల్ గవాస్కర్ ప్రస్తుతం ఇంగ్లాండ్ భారత్ మధ్య జరుగుతున్న ఐదు టెస్ట్ ల సిరిస్ గురించి స్పందిస్తూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసారు. ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా గత మూడు టూర్ లలో కూడా టీమిండియా కు చేదు అనుభవం ఎదురైంది. కానీ ఈ సారి మాత్రం గెలిచి తీరుతుంది అని విశ్లేషకులు చెబుతుంటే.. గెలవడం కాదు ఇక ఇంగ్లండ్ గడ్డపై భారత జట్టు పూర్తి ఆధిపత్యాన్ని సాధిస్తుంది అని సునిల్ గావస్కర్  చెప్పారు.  ప్రస్తుతం భారత్ ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న సిరీస్ లో ఇంగ్లాండ్ ను క్లీన్ స్వీప్ చేసి పూర్తి ఆధిపత్యాన్ని టీమిండియా సాధిస్తుందని చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: