వెస్టిండీస్ ఫాస్ట్ బౌలర్ డెయిల్ స్టెయిన్   గురించి దాదాపు క్రికెట్ ప్రేక్షకులందరికీ తెలిసే ఉంటుంది. ఎందుకంటే.. డెయిల్ స్టెయిన్ ఒక్కసారి బౌలింగ్ చేస్తున్నాడు అంటే బ్యాట్స్మెన్ వెన్నులో వణుకు పుడుతూ ఉంటుంది   తన ఫాస్ట్ బౌలింగ్ తో అంతలా విరుచుకుపడుతూ ఉంటాడు. ఇక కీలక సమయంలో వికెట్లు పడగొడుతూ మ్యాచ్ స్వరూపాన్ని మార్చేస్తూ ఉంటాడు. ఇక తన ఆటతో తన ప్రతిభతో ఇప్పటివరకూ ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఇక ఇటీవలే అభిమానులకు ఊహించని షాక్ ఇచ్చాడు   ఏకంగా తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్కు రిటైర్మెంట్ ప్రకటించాడు డెయిల్ స్టెయిన్.  ఈ విషయాన్ని తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలో వెల్లడించాడు.



 38 ఏళ్ల డెయిల్ స్టెయిన్ ఇంకా కొన్ని రోజులపాటు క్రికెట్ లో కొనసాగుతాడు అని అనుకున్నప్పటికీ తన 17 సంవత్సరాల క్రికెట్ కెరీర్ను ఇటీవలే ముగించాడు . ఇప్పటివరకు 93 టెస్ట్ మ్యాచ్లు, నూట ఇరవై ఐదు వన్డేలు, 47 టి20లో ఆడాడు. ఇప్పటివరకు తన కెరీర్లో ఎంతో అత్యుత్తమ బ్యాట్స్ మెన్ లను ఎదుర్కొన్నాడు డెయిల్ స్టెయిన్. ఈ రోజు నేను చాలా ఇష్టపడే ఆట నుంచి అధికారికంగా రిటైర్ అవుతున్నారు. ఇది చేదు తీపి కానీ అందరికీ కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నాను. కుటుంబం, సహచరులు జర్నలిస్టులు అభిమానుల వరకు అందరికీ ధన్యవాదాలు. ఇది ఒక అద్భుతమైన ప్రయాణం అంటూ ఇటీవల డెయిల్ స్టెయిన్ సోషల్ మీడియా ఖాతాలో వెల్లడించారు.



 గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం మెరుగ్గా ఉండవచ్చు. ఈ క్షణాలు గడిచిపోతున్నాయి అని నేను చెప్పడానికి ప్రయత్నించిన ప్రతి సారి నాకు గుర్తు ఉండడం లేదు అంటూ డెయిల్ స్టెయిన్ తన రిటైర్మెంట్ లేఖలో పేర్కొన్నాడు. ఇక క్రికెట్కు రిటైర్మెంట్ పలుకుతుంటే తన భావోద్వేగాలు ఎలా ఉన్నాయి అన్న విషయాన్ని తెలిపేందుకు అమెరికన్ రాక్ బ్యాండ్ కౌంటింగ్ కాకుల పాటలు ఉదాహరించాడు డెయిల్ స్టెయిన్. ఇది 20 సంవత్సరాల శిక్షణ, మ్యాచులు ప్రయాణం,విజయాలు, నష్టాలు, పరాజయం, ఆనందం మరియు సోదర భావం ఇలా క్రికెట్లో నాకు ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి అంటూ చెప్పుకొచ్చాడు డెయిల్ స్టెయిన్. ఒక్కసారిగా రిటైర్మెంట్ అభిమానులు అందరూ ఒక్కసారిగా షాకయ్యారు  అయితే డెయిల్ స్టెయిన్ 2019లో తన టెస్ట్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: