భారత పురుషుల క్రికెట్ హెడ్ కోచ్ గా మాజీ ప్లేయర్ మరియు ప్రస్తుతం అండర్ 19 కోచ్ రాహుల్ ద్రావిడ్ ను బీసీసీఐ అధికారికంగా నియమించింది. అయితే ఇది అంత ఈజీగా జరగలేదని తెలుస్తోంది. గతంలో రెండు మూడు సార్లు బీసీసీఐ రాహుల్ ద్రావిడ్ ను కోచ్ గా ఉండమని అడిగినా ఉపయోగం లేకుండా పోయింది. కానీ బీసీసీఐ అద్యక్షుడు సౌరవ్ గంగూలీ ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నాడు. ప్రస్తుతం పూర్తి ఫామ్ లో ఉన్న టీం ఇండియాకు కొత్త కోచ్ గా రాహుల్ ద్రావిడ్ అయితే సరిపోతాడని భావించి అతనిని చివరకు ఒప్పించడంలో సక్సెస్ అయ్యాడు. ఇప్పుడు ప్రస్తుతం కోచ్ గా ఉన్న రవిశాస్త్రి టీ 20 వరల్డ్ కప్ తర్వాత తన పదవీ కాలం ముగియనుంది.

ఇప్పుడు రాహుల్ ద్రావిడ్ ఇండియాకు హెడ్ కోచ్ గా రానుండడంపై అందరూ ప్రశంశల జల్లు కురిపిస్తున్నారు. ఇప్పుడు రాహుల్ ద్రావిడ్ పై అంచనాలు కూడా భారీగా పెరగనున్నాయి. ఇంతకు ముందు ఇండియాకు కోచ్ లుగా ఉన్న వారిలో ఒక్క గారీ క్రిస్టిన్ మాత్రమే వరల్డ్ కప్ అందించారు.  ఇప్పుడు కోచ్ గా ఉన్న రవిశాస్త్రి కనుక ఈ రోజు నుండి జరుగుతున్న వరల్డ్ కప్ టైటిల్ ను అందిస్తే ఘనమైన వీడ్కోలు దక్కనుంది. అయితే ఇప్పటి వరకు రాహుల్ ద్రావిడ్ కేవలం అండర్ 19 జట్టుకు మాత్రమే కోచ్ గా వ్యవహరించాడు. కానీ ఇక్కడ ఇండియన్ సీనియర్ మెన్ టీం కు కోచ్ అంటే సామాన్యమైన విషయం కాదు.  ఒక్కొక్క ఆటగాడు ఒక్కోలా వ్యవహరిస్తూ ఉంటారు. అందరినీ ఒకతాటిపైకి తెచ్చి వారి నుండి సరైన ఆటను తెచ్చుకోగలగాలి. మరి రాహుల్ ద్రావిడ్ కు కోచింగ్ అనేది కత్తి మీద సాము అనే చెప్పాలి.

రాహుల్ ద్రావిడ్ ప్రస్తుతం ఉన్న టీం ఇండియాను ఏ విధంగా తీర్చిదిద్దుతాడు అనేది రానున్న రోజుల్లో తెలుస్తుంది. అయితే రాహుల్ ద్రావిడ్ కోచ్ అయ్యాక తన ముందున్న సవాళ్ళలో వన్ డే మరియు టెస్ట్ లలో నెంబర్ వన్ స్థానానికి తీసుకురావడం. ప్రస్తుతం వన్ డే లలో నాలుగవ స్థానంలో ఉంది. టెస్ట్ లలో మాత్రం రెండవ స్థానంలో ఉంది. టీ ట్వంటీ లో కూడా రెండవ స్థానంలో ఉంది. మళ్ళీ అన్ని ఫార్మటు లలో మొదటి స్థానానికి తీసుకొస్తాడేమో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: