షెడ్యూల్ ప్రకారం టీ 20 ప్రపంచ కప్ క్వాలిఫైయర్ మ్యాచ్ లు జరుగుతున్నాయి. మరో వైపు వార్మప్ మ్యాచ్ లు కూడా జరుగుతున్నాయి. ఈ ప్రపంచ కప్ ను నెగ్గాలని లక్ష్యంగా అన్ని జట్లు అనేక వ్యూహాలతో ముందుకు వచ్చాయి. సూపర్ 12 లో ఆల్రెడీ ఇన్న జట్లు ఇతర జట్లతో రెండు వార్మప్ మ్యాచ్ లు పూర్తి చేసుకున్నాయి. వీటి తర్వాత జట్టు బలాలను పరిశీలిస్తే భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, సౌత్ ఆఫ్రికా జట్లు ఇతర జట్లతో పోలిస్తే దుర్భేద్యమైన బ్యాటింగ్ లైన్ అప్ మరియు బౌలింగ్ వనరులను కలిగి ఉన్నాయి. ప్రపంచ కప్ ను ఇప్పటి వరకు సౌత్ ఆఫ్రికా జట్టు గెలిచింది లేదు. ఎప్పుడూ ఎదో ఒక కారణంగా తమకు ప్రపంచ కప్ అందని ద్రాక్షలా మిగిలి పోయింది.

అయితే నిన్న పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ ను చూసిన ఎవ్వరైనా టైటిల్ ను నెగ్గడంలో సౌత్ ఆఫ్రికా ముందు ఉందని అర్ధం అవుతుంది. నిన్న ప్రాక్టీస్ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 187 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. లక్ష్య చేదనలో బరిలోకి దిగిన సౌత్ ఆఫ్రికా కు ఆరంభంలోనే షాక్ తగిలింది. ఓపెనర్లను కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో కెప్టెన్ బవుమా మరియు రస్సీ వాండర్ డసెన్ లు కలిసి ఇన్నింగ్స్ ను చక్కద్దిద్దారు. ఒకానొక దశలో 6 ఓవర్లకు 80+ పరుగులు చేయాల్సి వచ్చింది. కానీ డస్సెన్ అధ్బుతమైన బ్యాటింగ్ తో కొండంత లక్ష్యాన్ని కరిగించేశాడు. పాకిస్తాన్ బౌలింగ్ ఆటాక్ ను ఎదుర్కొని వీలైనప్పుడు బౌండరీలు బాదుతూ జట్టును గెలుపు దిశగా నడిపించాడు.

అలా ఆఖరి ఓవర్ కు 19 పరుగులు చేయాల్సి వచ్చింది. ఆఖరి బంతికి సింగిల్ తీస్తే విన్ అవుతుంది సౌత్ ఆఫ్రికా... డస్సెన్ ఫోర్ కొట్టి ఘన విజయాన్ని తన జట్టుకు అందించాడు. ఇన్నింగ్స్ మధ్యలో సౌత్ ఆఫ్రికా ఆ లక్ష్యాన్ని సాధిస్తుందని ఎవ్వరూ ఊహించి ఉండరు. కానీ డస్సెన్ అధ్బుతమైన సెంచరీతో జట్టుకు మంచి విజయాన్ని అందించాడు. ఈ గెలుపుతో ప్రత్యర్థులకు వెన్నులో వణుకు పుట్టించారు. ఇదే ఫామ్ ను కొనసాగిస్తే ఈ సారి ఖచ్చితంగా వరల్డ్ కప్ కొట్టగలరు అని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు. మరి ఏమి జరగనుంది అనేది తెలియాలంటే కొన్ని రోజులు  ఆగక తప్పదు.

మరింత సమాచారం తెలుసుకోండి: