ఇంగ్లాండ్ క్రికెట్ లో స్టార్ క్రికెటర్ గా కొనసాగుతున్నాడు మోయిన్ అలీ. ఆల్రౌండ్ ప్రదర్శనతో ఎప్పుడూ ఆశ్చర్య పరుస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఎప్పుడు మైదానంలోకి గాడు అంటే చాలు ప్రతి బంతిని బౌండరీ తరలించేందుకు ప్రయత్నిస్తూ ఉంటాడు. ఇక మోయిన్ అలీ ఒక్కసారి మైదానంలోకి దిగాడు అంటే చాలు అతని ఆటను చూడటానికి అందరూ ఎక్కువగా ఆసక్తి చూపుతారు అని చెప్పాలి. తనదైన ఆటతీరుతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. కేవలం బంతితో మాత్రమే కాదు తన బ్యాట్తో కూడా అదరగొడుతు జట్టుకు విజయాన్ని అందించిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే మొయిన్ అలీ ఇంగ్లాండ్ క్రికెటర్ అయినప్పటికీ అటు ఇండియాలో కూడా ఎంతో మంది అభిమానులు ఉన్నారు అని చెప్పాలి. ఎందుకంటే ఎన్నో సీజన్ల నుంచి ఐపీఎల్లో ఎంతో గుర్తింపు పొందిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో కీలక ఆల్రౌండర్ గా కొనసాగుతున్నాడు. ఇక ఇటీవల జరిగిన ఐపీఎల్ సీజన్ లో కూడా అదరగొట్టాడు అనే చెప్పాలి. అయితే తక్కువ బంతులలో ఎక్కువ పరుగులు చేయడంలో మోయిన్ అలీ సమర్ధుడు. ఇప్పుడు వరకు ఎన్నో సార్లు ఇలా పరుగుల వరద పారించాడు. అరుదైన రికార్డును కూడా క్రియేట్ చేశాడు. ఇక ఇటీవలే ప్రపంచ క్రికెట్లో స్టార్ ఆల్ రౌండర్ గా కొనసాగుతున్న మొయిన్ ఆలీ మరోసారి అదరగొట్టి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. అబుదాబిలో ప్రస్తుతం టీ10 టోర్నీ జరుగుతుంది. ఇక ఈ టోర్నీలో ఆల్ రౌండర్ మోయిన్ అలీ పరుగుల వరద పారించాడు.. ఇటీవలే  టీం అబుదాబి... నార్తర్న్ వారియర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఇక నార్తర్న్ వారియర్స్ జట్టు లో కొనసాగుతున్న మోయిన్ అలీ   ఈ మ్యాచ్లో కేవలం 23 బంతుల్లో 77 పరుగులు చేసి విజృంభించాడు. ఇందులో తొమ్మిది సిక్సర్లు 3 ఫోర్లు ఉండటం గమనార్హం. ఇక మరో ఓపెనర్ కిండర్ లూయిస్ 32 బంతుల్లో 65 పరుగులు చేశాడు. ఇలా తమ ముందు ఉన్న 145 పరుగుల లక్ష్యాన్ని కేవలం 9.1 ఓవర్లలోనే చేధించి ఘన విజయాన్ని సాధించింది జట్టు. కేవలం 16 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసిన మోయిన్ అలీ ఈ ఫార్మాట్లో అత్యంత వేగంగా  హాఫ్ సెంచరీ చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: