నేడు ఇండియా పురుషుల సీనియర్ క్రికెట్ జట్టుకు ఎంతో ముఖ్యమైన రోజు. గత కొంత కాలంగా ప్రపంచ క్రికెట్ లో చెరగని ముద్ర వేసుకుంటూ వచ్చిన ఇండియా టీ 20 వరల్డ్ కప్ నుండి తడబడుతోంది. అంచనాలను తగ్గట్టు రాణించడంతో విఫలం అవుతోంది. సౌత్ ఆఫ్రికా పర్యటనలో టెస్ట్ సిరీస్ మరియు వన్ డే సిరీస్ లను కోల్పోయి ర్యాంకింగ్ లలోనూ బాగా పడిపోయింది. ఇక ఈ టూర్ లో మిగిలి ఉన్నది కేవలం ఆఖరి వన్ డే మాత్రమే. ఇందులో అయినా గెలిచి కాస్త పరువు దక్కించుకోవాలని ఇండియా భావిస్తోంది. మరి అనుకున్నది జరగాలంటే పక్కా ప్లాన్ ప్రకారం ఆడాల్సిందే.

అయితే ఈ వన్ డే సిరీస్ లో ఇండియా కు ప్రతికూలంగా ఉన్న అంశాలు ఏమిటో ఒకసారి తెలుసుకోవాలి. ఇండియా బౌలింగ్ యూనిట్ అంత పదునుగా లేదు. ఆరంభంలో వికెట్లు తీయడంలో దారుణంగా ఫెయిల్ అవుతున్నారు. ఇక బ్యాటింగ్ లో మిడిల్ ఆర్డర్ వైఫల్యం. వీటి గురించి నిన్ననే మనము చెప్పుకున్నాము. ఇప్పుడు ప్రత్యర్థి జట్టులో ఇండియాకు విజయాన్ని దూరం చేస్తున్న వారిని అడ్డుకుంటే ఒకరకంగా మనము గెలవడానికి ఈజీ అవుతుంది.

ప్రధానంగా చెప్పుకోవాలంటే మొదటి వన్ డే లో మనకు మ్యాచ్ ను దూరంచేసింది టెంబా బావుమా మరియు వండర్ డస్సెన్ ల సెంచరీలు. కానీ బావుమా నిదానంగా ఆడినా డస్సెన్ మాత్రం బౌలర్లపై విరుచుకుపడతాడు. ఇక రెండవ వన్ డే లో ఖ్వింటన్ డికాక్ తన దూకుడైన బ్యాటింగ్ తో మొదటి 20 ఓవర్ల లోనే విజయాన్ని దూరంచేశాడు. కాబట్టి ఈ రోజు మ్యాచ్ లో డస్సెన్ మరియు డికాక్ లను అడ్డుకుంటే సగం విజయం సాధించినట్లే. అయితే వీరిద్దరినీ కూడా క్రీజులో నిలదొక్కుకోనీయకుండా చెయ్యాలి. కొన్ని బంతులు ఆడారా, ఇక వారిని ఆపడం కష్టమే అవుతుంది. కాబట్టి ఈ రోజు బుమ్రా, సిరాజ్ లు ఏకధాటిగా వారిపై అటాక్ చేస్తే వికెట్ తీయవచ్చు. మిగిలిన వారు అంత ప్రమాదమా కాకపోయినా వీరిద్దిరి విషయంలో మాత్రం రాహుల్ వ్యూహాలను అమలు చేసి అవుట్ చెయ్యాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: