ప్రతి ఒక్కరు కూడా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ అద్భుతంగా రాణిస్తున్నారు. తమ ఆట తీరు తో తామే ఇండియా ఫ్యూచర్ స్టార్స్ అని చెప్పకనే చెబుతున్నారు. ఇలాంటి సమయంలో జట్టులో ఉన్న సీనియర్లు నిరంతరం అద్భుతమైన ఫామ్ లో కొనసాగుతూ తమను తాము కొత్తగా చూపించాల్సిన అవసరం ఏర్పడింది. ఏమాత్రం రాణించక పోయినా వారిని పక్కన పెట్టేస్తున్నారు. కాగా ఇటీవలే చాలా రోజుల తర్వాత సౌత్ ఆఫ్రికా పర్యటనలో భాగంగా వన్డే జట్టులో అవకాశం దక్కించుకున్నాడు భువనేశ్వర్ కుమార్. స్టార్ బౌలర్ గా పేరు తెచ్చుకున్న ఇతను అటు దక్షిణాఫ్రికా పర్యటనలో మాత్రం ఎక్కడ అంచనాలను అందుకోలేకపోయాడు అని చెప్పాలి.
అతని పేలవమైన ఫామ్ కారణంగా అతన్ని పక్కన పెట్టాల్సిన పరిస్థితులు కూడా వస్తున్నాయి. తాజాగా ఇదే విషయంపై టీమిండియా మాజీ ఆటగాడు సునీల్ గవాస్కర్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా పేసర్ భువనేశ్వర్ కుమార్ ఫేస్ లో పస లేకుండా పోయింది అంటూ వ్యాఖ్యానించాడు. బౌలింగ్ లో మునుపటి పదును ఎక్కడా కనిపించడం లేదని చెప్పుకొచ్చాడు.. ఇక ఇలాంటి పేలవమైన పామ్ తో రానున్న ప్రపంచ కప్ జట్టులో అవకాశం దక్కించుకోవటం అతనికి ఎంతో కష్టమే.. కొన్నాళ్ళ వరకు బ్రేక్ తీసుకొని బౌలింగ్ పై దృష్టి సారిస్తే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు సునీల్ గవాస్కర్.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి