ఇటీవలే విరాట్ కోహ్లీ ఐపీఎల్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు తో తనకు ఉన్న అనుబంధాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. ఆర్ సి బి ఫ్రాంచైజీ తమ ఆటగాళ్ళందరూ మాట్లాడిన ఒక వీడియోను సోషల్ మీడియాలో పంచుకుంది. ఇందులో భాగంగా విరాట్ కోహ్లీ సహా మిగతా ఆటగాళ్లు అందరూ కూడా ఐపీఎల్ తమను ఎలా మార్చింది అనే విషయాలను పంచుకున్నారు. విరాట్ కోహ్లీ మాట్లాడుతూ ఐపీఎల్ వేలం జరిగినప్పుడు అండర్ 19 ప్రపంచ కప్ లో మలేషియాలో నేను ఉన్నాను. ఆ రోజు నాకు ఇంకా గుర్తుంది.. ఆ సమయంలో నన్ను ఎంత ధరకి తీసుకోవాలని అనుకున్నారో తెలిసి ఒక్కసారిగా ఆశ్చర్యపోయాను.
అది తక్కువ అమౌంట్ కాదు చాలా పెద్ద మొత్తం.. గతంలో 25 లక్షలకు కొన్నారు. బెంగళూరు జట్టు నన్ను జట్టులోకి తీసుకోవడం నా జీవితంలో ఒక ప్రత్యేకమైన సందర్భం. ఇక బెంగళూరు జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన నేను ఇప్పుడు ఈ స్థాయికి చేరుకుంటాని కలలో కూడా ఊహించలేదు. నాకు మాటలు ఊరుట కన్న నిజాయితీగా ఉండడం ఇష్టం అంటూ కోహ్లీ చెప్పుకొచ్చాడు. ఇక నేను ఐపీఎల్ ఆడే చివరి రోజు వరకు కూడా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టులోనే కొనసాగుతారు విరాట్ కోహ్లీ తెలిపాడు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి