ఇలా గత కొన్ని రోజుల నుంచి కోహ్లీ తర్వాత కెప్టెన్సీ ఎవరు అందుకోబోతున్నారు అన్న దానిపై మాత్రం తీవ్రస్థాయిలోనే చర్చ జరుగుతుంది. ఈక్రమంలోనే రిషబ్ పంత్, కె.ఎల్.రాహుల్ లాంటి యువ ఆటగాళ్ల పేర్లు తెరమీదకు వచ్చాయి.. ఇక తమకు టెస్ట్ కెప్టెన్సీ వచ్చినా స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నామంటూ బౌలర్లు జస్ప్రిత్ బూమ్రా, షేమి ఆటగాళ్లు కూడా మనసులో మాట బయటపెట్టారు. అయితే బీసీసీఐ మాత్రం ఇప్పటివరకు ఈ విషయంపై స్పందించి లేదు అని చెప్పాలి.
ఇక తాజాగా ఇదే విషయంపై బిసిసిఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీమిండియాకు కొత్త టెస్ట్ కెప్టెన్ ని త్వరలోనే ప్రకటిస్తాం అంటూ చెప్పుకొచ్చాడు. దీనికి సంబంధించి ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి అని క్లారిటీ ఇచ్చారు. అదే సమయంలో తాను సెలక్షన్ కమిటీ సమావేశం లో కూర్చొని రూల్స్ కు విరుద్ధంగా ప్రభావితం చేస్తున్నా అంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు అంటూ స్పష్టం చేశాడు. ఎవరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం తనకు లేదని.. తానేమీ నేరుగా బోర్డు అధ్యక్షుడిని కాలేదు అంటూ వ్యాఖ్యానించాడు. 400కు పైగా అంతర్జాతీయ మ్యాచ్లు ఆడిన విషయాన్ని తనపై విమర్శలు చేసే వారు గుర్తుంచుకుంటే బాగుంటుంది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు సౌరవ్ గంగూలీ.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి