ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ ప్రేక్షకులు అందరూ ఎదురుచూస్తున్న రోజు మరి కొన్ని రోజుల్లో రాబోతుంది. అదే ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభం. మార్చి 26వ తేదీ నుంచి ఘనంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభం కాబోతుంది అన్న విషయం తెలిసిందే. ఇక ఈ మెగా టోర్ని చూసేందుకు అభిమానులు అందరూ కూడా సిద్ధమైపోయారు. అయితే ఈసారి వినూత్నమైన రీతిలో ప్రేక్షకులను ఎంటర్ టైన్ మెంట్ అందించేందుకు సిద్ధమయింది ఐపీఎల్. ఐపీఎల్ లో 10 జట్లు పోటీ పడుతూ ఉండగా ఏకంగా రెండు గ్రూపులుగా ఏర్పడ్డాయి.


 ఇకపోతే అందరు ఆటగాళ్లు జట్టు క్యాంపులో చేరిపోవడంతో ఇక ఆయా జట్ల యాజమాన్యాలు ఆటగాళ్లకు ప్రత్యేక శిక్షణ శిబిరాలు నిర్వహిస్తూ ఉండడం గమనార్హం. ఈ క్రమంలోనే ఆటగాళ్లలో ఉన్న మానసిక ఒత్తిడిని పోగొట్టేందుకు ముంబై ఇండియన్స్ సైతం తమ కార్యాచరణ ప్రారంభించింది. బయో బబుల్ కారణంగా ఆటగాళ్ల లో ఏర్పడిన మానసిక ఒత్తిడిని పోగొట్టి ఉల్లాసంగా ఉండేలా చేసేందుకు ఎన్నో వినూత్నమైన  వినోదభరితమైన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే ముంబై ఇండియన్స్ ఏకంగా బయో బబుల్ ఉండడానికి ఉండటానికి కాదు టూర్ లో ఎంజాయ్ చేయడానికి వచ్చారేమో అన్న విధంగా వినోదభరిత కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉండడం గమనార్హం.


 ఈ క్రమంలోనే ముంబై ఇండియన్స్ ఆటగాళ్లు అందరూ కూడా చిల్ అవుతున్న ఒక వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ. ఇక ఇందులో జట్టు సిబ్బందితోపాటు కెప్టెన్ రోహిత్ శర్మ మిగతా ఆటగాళ్లు అందరూ కూడా పాల్గొని సందడి చేశారు. ఇక ఇందులో ఆటగాళ్లు అందరూ కూడా సరదాగా గడిపేందుకు ఇక కొన్ని ఫన్నీ గేమ్స్ ఆడించేందుకు సిద్ధమయ్యారు అన్నది తెలుస్తుంది.  ఇక ముంబై జట్టులోని ఆటగాళ్ళు అందరిని కూడా కొన్ని టీమ్స్ గా విభజించి ఫన్నీ గేమ్స్ ఆడించబోతున్నారు. ఇక ఈ వీడియో కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: