ఐపీఎల్లో ఎంతో మంది యువ ఆటగాళ్లు అద్భుతంగా రాణిస్తూ అరుదైన రికార్డును సొంతం చేసుకుంటూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అదే సమయంలో మరికొంత మంది ఆటగాళ్లు ప్రదర్శనతో నిరాశపరిచి చెత్త రికార్డులను ఖాతాలో వేసుకోవడం వంటివి చేస్తూ ఉంటారు. ఇటీవలే మొన్నటికి మొన్న ఆస్ట్రేలియా లో జరిగిన బిగ్ బాస్ లీగ్ లో సూపర్ హిట్ ఆటగాడిగా ప్రశంసలు అందుకున్న స్టార్ ప్లేయర్ ఇక ఇప్పుడు ఐపీఎల్లో మాత్రం చెత్త రికార్డు నమోదు చేశాడు. అతను ఎవరో కాదు ఆస్ట్రేలియా స్టార్ ఆల్రౌండర్ డానియల్ సామ్స్.

 నికార్సైన ఆల్రౌండర్గా ఎంతగానో గుర్తింపు సంపాదించుకున్న డేనియల్ సామ్స్ బిగ్ బాష్ లీగ్ లో భాగంగా అరవై రెండు మ్యాచ్ల్లో ఎనభై రెండు వికెట్లు తీసి తనకు తిరుగు లేదు అని నిరూపించాడు. బ్యాటింగ్ లో కూడా 622 పరుగులు చేసి ఔరా అనిపించాడు. ఇక అతని వ్యక్తిగత అత్యధిక స్కోరు 98 నాట్ ఔట్ కావడం గమనార్హం. ఎంత మంచి రికార్డు  కలిగిన ఈ స్టార్ ప్లేయర్ ఐపీఎల్ లో మాత్రం పూర్తిగా విఫలం కావడం గమనార్హం. ఐపీఎల్ చరిత్రలోనే డేనియల్స్ అత్యంత చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. ప్రస్తుతం ఈ ఆల్ రౌండర్ ముంబై ఇండియన్స్ కి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.



 ఇక ఐపీఎల్లో అతని బౌలింగ్ యావరేజ్ ఏకంగా 242. షాక్ అవుతున్నారు కదా మీరు విన్నది నిజమే.. ఐపిఎల్ చరిత్రలోనే అత్యంత చెత్త బౌలింగ్ యావరేజ్ కలిగిన ఆటగాడిగా డానియల్  చెత్త రికార్డు సృష్టించారు. 2020లో ఢిల్లీ క్యాపిటల్స్ ద్వారా ఐపీఎల్ లోకి ఎంట్రీ ఇచ్చాడు.  ఇక ఆ సీజన్లో కేవలం మూడు మ్యాచ్లు మాత్రమే ఆడి ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. తర్వాత బెంగుళూరు జట్టులోకి మారాడు. ఇక భారత్ వేదికగా జరిగిన ఐపీఎల్ లో భాగం అయిన డానియల్  యూఏఈలో జరిగిన మిగతా  సీజన్ కి మాత్రం దూరమయ్యాడు. ఇక ఈ ఏడాది ముంబై ఇండియన్స్ లో కి వచ్చాడు.  చివరకు రెండు మ్యాచ్లు ఆడిన సాంగ్స్ 11.13 ఎకనామి రేటుతో 89 పరుగులకు ఇచ్చి ఒక వికెట్ గా తీయలేకపోయాడు. మొత్తంగా  మూడేళ్ల నుంచి ఏడు మ్యాచ్లలో 26 ఓవర్లు వేసి 242 బౌలింగ్ యావరేజ్ తో  కేవలం ఒక్క వికెట్ మాత్రమే తీసిన అత్యంత చెత్త రికార్డు మూటగట్టుకున్నాడు ఈ ఆల్రౌండర్.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl