ఇటీవల ఐపీఎల్ ప్రారంభమైంది. ఇక ప్రతి మ్యాచ్ కూడా ఎంతో ఉత్కంఠ భరితంగా సాగుతుంది. ఛాంపియన్ జట్లు డీలా పడిపోతూ వరుస ఓటములు చవి చూస్తున్న నేపథ్యంలో ఐపీఎల్ లో కొత్తగా ఎంట్రీ ఇచ్చిన జట్లు ఇక మొన్నటివరకు పేలవమైన ప్రస్థానాన్ని కొనసాగించిన జట్లు ఈ సారి మాత్రం వరుస విజయాలతో దూసుకుపోతూ ఉండడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఈ క్రమంలోనే  ఐపీఎల్ మ్యాచ్లు మరింత ఉత్కంఠభరితంగా మారిపోయాయి. ఏ మ్యాచ్లో ఏ జట్టు గెలుస్తుంది అన్నది కూడా ఊహకందని విధంగానే మారిపోయింది అని చెప్పాలి. ఇకపోతే ఇటీవలే పంజాబ్ కింగ్స్ గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన మ్యాచ్ ఎంతో ఉత్కంఠ భరితంగా మారిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.



 చివరి బంతి వరకు ఎవరు గెలుస్తారో కూడా తెలియని విధంగా ఇక ప్రేక్షకులందరినీ ఉత్కంఠతో మునివేళ్ళపై నిలబెట్టింది. ఇలా ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ బ్యాట్స్మెన్ రాహుల్ తేవాటియా చివరి రెండు బంతుల్లో 12 పరుగులు అవసరమైన సమయంలో ఏకంగా రెండు సిక్సర్లు బాది గుజరాత్ టైటాన్స్ జట్టుకు అద్భుతమైన విజయాన్ని అందించాడూ. అయితే సాధారణంగా రెండు బంతుల్లో 12 పరుగులు అవసరమైన సమయంలో పెద్దగా అనుభవం లేని ఆటగాళ్లకు ఎవరైనా సరే తీవ్ర ఒత్తిడికి గురవుతూ ఉంటారు. కానీ రాహుల్ తేవాటియాలో మాత్రం ఎలాంటి ఒత్తిడి ఎక్కడా కనిపించలేదు.



 ఎంతో కూల్ గా చివరి రెండు బంతులను భారీ సిక్సర్లు గా మలిచి జట్టుకు విజయాన్ని అందించాడు. ఇక ఇలా రాహుల్ తేవాటియా కొట్టిన రెండు సిక్సర్ల గురించి ప్రస్తుతం అందరూ చర్చించుకుంటున్నారు. ఎంతో మంది మాజీ క్రికెటర్లు అతని పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.. ఇటీవల ఇదే విషయంపై దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ స్పందిస్తూ రాహుల్ తేవాటియా ను పొగడ్తలతో ముంచెత్తాడు. అంత ఒత్తిడిలో కూడా ఆఫ్ స్టాంప్  అవతలికి వెళ్లి సిక్సర్ కొట్టాడు అతను. అతని నరాల్లో ఏం పరుగులు తీస్తుంది అర్థం కావడం లేదు.. నాకైతే అది బ్లడ్ ఇలా కనిపించడం లేదు ఐస్ పరుగులు తీస్తుంది అనుకుంటా అంటూ సునీల్ గవాస్కర్ వ్యాఖ్యానించాడు. డెత్ ఓవర్లలో ఎలా బౌలింగ్ చేయాలో కోచ్ లు బౌలర్లకు సలహాలు ఇవ్వాలని సూచించాడు సునీల్ గావస్కర్..

మరింత సమాచారం తెలుసుకోండి: