ఇటీవల ఐపీఎల్ లో భాగంగా రాజస్థాన్ రాయల్స్ ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వరుస విజయాలతో దూసుకుపోతున్న రాజస్థాన్ రాయల్స్ జట్టు విజయం సాధించడం ఖాయం అని అందరూ అనుకున్నారు. ఇక వరుస ఓటములతో సతమతమవుతున్న ముంబై ఇండియన్స్ జట్టు ఓటమి దాదాపు ఖరారు అయిపోయింది అని భావించారు. కానీ ఊహించని రీతిలో అటు ముంబై ఇండియన్స్ పుంజుకుంది. వరుస విజయాలతో దూసుకుపోతున్న రాజస్థాన్ రాయల్స్ ను ఓడించి  ఐపీఎల్ సీజన్ లో మొదటి విజయాన్ని నమోదుచేసింది ముంబై ఇండియన్స్ జట్టు.


 అయితే ఇక ఈ మ్యాచ్ ఆసాంతం ఎంతో ఉత్కంఠ భరితంగా సాగింది అనే చెప్పాలి. చివరి వరకు ఎవరు గెలుస్తారో అని కూడా ఉత్కంఠ గానే   మారిపోయింది. రాజస్థాన్ ఇన్నింగ్స్ జరుగుతున్న సమయంలో షాకింగ్ సంఘటన చోటుచేసుకుంది. రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు జోస్ బట్లర్  కొద్దిలో గాయం నుంచి తప్పించుకున్నాడు. ఇన్నింగ్స్ లో భాగంగా ఆరో ఓవర్ మెరిడిత్ వేశాడు. ఐదో బంతి మెరీడిత్ షార్ట్ బౌన్సర్ వేశాడు. జోష్ బట్లర్ ఫుల్ షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలోనే  బంతి మిస్ అయ్యి ఇక హెల్మెట్ను బలంగా తాకింది. దీంతో జోస్ బట్లర్ కి పెద్ద గాయం అయింది అని అందరూ అనుకున్నారు.


 ఇక బంతి వేగానికి బట్లర్ తల అద్దిమినట్లు అయింది. దీనితో ఫిజియో వచ్చి పరిశీలించారు. ఇక తాను బాగానే ఉన్నట్లు బట్లర్ చెప్పుకొచ్చాడు. దీంతో రాజస్థాన్ ఆటగాళ్లు ఊపిరి పీల్చుకున్నారు అనే చెప్పాలి. దీంతో ఆ తర్వాత ఆట యథాతథంగా కొనసాగింది. అయితే బట్లర్ తలకి గాయం కావడంతో రాజస్థాన్  అభిమానులు అందరూ కూడా ఒక్కసారిగా షాక్ లో మునిగిపోయారు. గాయం వల్ల ఎలాంటి ప్రమాదం లేదని తెలియడంతో ఊపిరి పీల్చుకున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl