ప్రపంచ క్రికెట్లో బీసీసీఐ ప్రతియేడాది నిర్వహించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ కి ఎంత ప్రాముఖ్యత ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రస్తుతం ప్రపంచంలోనే రిచెస్ట్ లీగ్ గా కొనసాగుతోంది. ఇక ఈ లీగ్ లో స్వదేశి ఆటగాళ్లతో పాటు విదేశీ ఆటగాళ్లు కూడా ఆడటానికి ఎక్కువగా ఆసక్తి చూపుతారని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక ప్రతి ఏడాది కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగే ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ఆడితే ఎంతో అనుభవం సాధించవచ్చు అని ప్రతి క్రికెట్ ప్లేయర్ భావిస్తూ ఉంటాడు. ఇకపోతే ఇటీవల ఇండియన్ ప్రీమియర్ లీగ్ కు పోటీగా మెగా టోర్నీకి స్ఫూర్తిగా యూఏఈ వేదికగా మరో టి20 లీగ్ ప్రారంభించాలని ఇటీవల నిర్ణయించింది ఆ దేశ క్రికెట్ బోర్డు.



 ఈ క్రమంలోనే త్వరలో టి20 లీగ్ ప్రారంభం కాబోతుంది. అయితే ఈ టీ20 లీగ్ లో అటు బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ కూడా భాగం అవబోతున్నాడు అన్నది తెలుస్తుంది. ఐపీఎల్ స్ఫూర్తితో యూఏఈ వేదికగా ప్రారంభం కాబోతున్న టి20 లీగ్ లో ఒక ఫ్రాంచైజీని షారుక్ ఖాన్ దక్కించుకున్నాడు అనేది తెలుస్తుంది.  కాగా ఇప్పటికే ఇండియన్ ప్రీమియర్ లీగ్లో భాగంగా కోల్కతా నైట్ రైడర్స్ ఫ్రాంచైజీ  యజమానిగా కొనసాగుతున్నాడు షారుక్ ఖాన్. ఇక ఇప్పుడు లో యూఏఈ  జరిగే లీగ్ లో షారుక్ ఖాన్ దక్కించుకున్న ఫ్రాంచైజీకి  అబుదాబి నైట్ రైడర్స్ అనే పేరును ఫిక్స్ చేశాడు.  ఈ విషయాన్ని ఆ ఫ్రాంచైజీ  ట్విట్టర్ వేదికగా వెల్లడించడం గమనార్హం.


 షారుక్ ఖాన్ -  జుహీ చావ్లా భాగస్వాములుగా ఏర్పడిన నైట్రైడర్స్ గ్రూప్ ఐపీఎల్ కోల్కత్తా నైట్ రైడర్స్ ను కొనుగోలు చేసిన తర్వాత 2015లో విండీస్ వేదికగా జరిగే కరేబియన్ ప్రీమియర్ లీగ్ లో త్రింబాగో నైట్ రైడర్స్  ఫ్రాంచైజీని సొంతం చేసుకుంది. ఇప్పుడు యూఏఈ టి20 లీగ్ లో అబుదాబి నైట్రైడర్స్ ను హస్తగతం చేసుకోవడం గమనార్హం.  ఇక రానున్న రోజుల్లో  యూఎస్ ఏ వేదికగా జరిగే మేజర్ లీగ్ క్రికెట్ లో కూడా లాస్ఏంజిల్స్ ను సొంతం చేసుకునేందుకు సిద్ధమవుతోంది. ఇలా షారూక్ ఖాన్ వరుసగా దేశీయ క్రికెట్ లీగ్లో ఫ్రాంఛైజీల ను సొంతం చేసుకుంటూ బిజినెస్ లు పెంచుకుంటున్నాడు..

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl