ఇటీవలే ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం మాజీ ఆటగాడు సైమండ్స్ కారు ప్రమాదం బారిన పడి దుర్మరణం పాలయ్యారు అన్న విషయం తెలిసిందే. అయితే 46 ఏళ్ల  సైమండ్స్ ఇలా కారు ప్రమాదం కారణంగా ఆకస్మిక మరణం చెందటాన్ని అటు అభిమానులు జీర్ణించుకోలేక పోయారు. ఒక్కసారిగా దిగ్భ్రాంతిలో మునిగిపోయారు. అయితే  సైమండ్స్ ఉంటున్న క్వీన్స్ లాండ్ లోని టౌన్స్ విల్లే లో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన ఆండ్రూ సైమండ్స్ చివరికి చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు.

 అయితే అతి వేగం కారణంగా ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని ప్రాథమికంగా నిర్ధారించిన పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని పూర్తి వివరాలను సేకరించేందుకు విచారణ కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆండ్రూ సైమండ్స్ కారు ప్రమాదానికి సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి అని తెలుస్తోంది. కారు ప్రమాదంలో ఆండ్రూ సైమండ్స్ అక్కడికక్కడే మృతిచెందాడు అంటూ ప్రత్యక్ష సాక్షి అయిన వేలాన్ టౌన్సన్ అనే వ్యక్తి చెప్పుకొచ్చాడు. ప్రమాదం జరిగిన సమయం లో తాను అతి సమీపం లో ఉన్నాను అంటూ తెలిపాడు..


 ఆండ్రూ సైమండ్స్ ప్రాణాలను కాపాడేందుకు విశ్వ ప్రయత్నాలు చేసాను అంటూ చెప్పుకొచ్చాడూ. నా కళ్ళ ముందే కారు ఆక్సిడెంట్ కి గురయింది. అతివేగం తో ఉన్న కారు డివైడర్ను ఢీకొని బోల్తా పడింది. ఈ క్రమం లోనే సైమండ్స్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కారులో ఇరుక్కు పోయిన ఆయనను కాపాడేందుకు సిపిఆర్ కూడా చేశాను. కానీ అప్పటికే ఆయన ప్రాణాలు కూడా విడిచారు.  ప్రమాదానికి గురైన వ్యక్తి సైమండ్స్ అన్న విషయం నాకు తెలియదు అంటూ ప్రత్యక్ష సాక్షి చెప్పుకొచ్చాడు. ఇక కారు లో సైమండ్స్ తో పాటు రెండు పెంపుడు కుక్కలు ఉన్నాయి అని.. ఈ ప్రమాదం లో వాటికి ఎలాంటి అపాయం జరగలేదు అంటూ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: