ఈ ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా అత్యంత చెత్త ప్రదర్శన చేసిన జట్టు ఏదైనా ఉంది అంటే అది ఛాంపియన్ ముంబై ఇండియన్స్ జట్టు అని చెప్పాలి. వరుస విజయాలు సాధించి అదరగొడుతుంది అనుకున్న ముంబై ఇండియన్స్ వరుస పరాజయాలతో సతమతమవ్వటంతో అభిమానులందరూ  కూడా షాక్ లో మునిగి పోయారు అని చెప్పాలి. అయితే ఇక ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ లో ముంబై ఇండియన్స్ అందరికంటే ముందే ఐపీఎల్ నుంచి నిష్క్రమించిన జట్టుగా చెత్త రికార్డును సొంతం చేసుకుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.


 అయితే ముంబై ఇండియన్స్ లోని అందరు ఆటగాళ్లు పేలవ ప్రదర్శనతో విమర్శలు ఎదుర్కొంటున్న సమయంలో ఒక ఆటగాడు మాత్రం తన ప్రదర్శనతో అందరి చూపులు ఆకర్షించాడు. టీమ్ ఇండియా ఫ్యూచర్ స్టార్ నేనే అని ఎంతోమంది ప్రేక్షకులలో నమ్మకాన్ని కలిగించాడు. అతను ఎవరో కాదు మన హైదరాబాద్ ప్లేయర్ తిలక్ వర్మ. అతని 1.7 కోట్లకు కొనుగోలు చేసింది ముంబై ఇండియన్స్. తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు తిలక్ వర్మ.


 12 మ్యాచ్ లో ఏకంగా 368 పరుగులు చేసి ముంబై ఇండియన్స్ జట్టు తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. తీవ్ర ఒత్తిడిలో ఎంతో కూల్గా కనిపిస్తూ అందరినీ ఆకట్టుకున్నాడు. అతనిపై ఇటీవలే సునీల్ గవాస్కర్ ప్రశంసల కురిపించాడు. తిలక్ వర్మ క్రికెట్కు సంబంధించిన ప్రాథమిక సూత్రాలను అందిపుచ్చుకున్నాడు. టెక్నికల్ గా కూడా ఎంతో బాగా ఆడుతున్నాడు. స్ట్రైట్ బ్యాట్ వినియోగించడం వల్ల ఎలాంటి బంతినైనా అలవోకగా ఎదుర్కొంటూ ఉన్నాడు. ఒక మంచి టెక్నిక్ తో పాటు దూకుడు కూడా అతని సొంతం. రోహిత్ చెప్పినట్టుగానే తిలక్ అన్ని ఫార్మాట్లకు సరిగ్గా సరిపోయే క్రికెటర్. ఖచ్చితంగా టీమిండియా తరఫున ఆడుతాడు అంటు సునీల్ గవాస్కర్ ప్రశంసలు కురిపించాడు..

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl