గత సీజన్ లో దారుణమైన ప్రదర్శన కనబరిచి, సగం సీజన్ లోనే మోస్ట్ సీనియర్ బ్యాట్స్మన్ మరియు కెప్టెన్ అయిన వార్నర్ ను మధ్యలోనే కెప్టెన్ గా తీసేసి నానా హంగామా చేసింది సన్ రైజర్స్ యాజమాన్యం. అయిన తన పప్పు ఉడకలేదు. దానితో ఐపీఎల్ సీజన్ 15 పై ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఖచ్చితంగా టైటిల్ ను గెలవాలి అనే ఉద్దేశ్యంతోనే ప్రతి ఒక్కటి ప్లాన్ చేసుకుంటూ వచ్చింది. కానీ ఇక్కడ కూడా సరైన ప్రదర్శన కనబరచడంతో ఫెయిల్ అయ్యి సీజన్ ను 8 వ స్థానంతో సరిపెట్టుకుని ముగించింది. అయితే దీనికి దారి తీసిన కారణాలను ఒకసారి చూద్దాం.

* మొదటగా ఐపీఎల్ మెగా వేలంలో ఆటగాళ్ల ఎంపిక సరిగా లేదు. వార్నర్ ను కెప్టెన్ గా కొనసాగించకపోయినా ఆటగాడిగా అయినా ఉంచుకుని ఉంటే బాగుండేది. కానీ ఇక్కడ దారుణంగా ఫెయిల్ అయింది. కొందరి ప్లేయర్ లను దక్కించుకునే ఛాన్స్ వచ్చినా వారిని మిగిలిన టీమ్స్ కు వదిలేయడం లాంటివి చేసి భారీ మూల్యం చెల్లించుకున్నాయి.

* ఇక ఒక గేమ్ గెలవాలంటే కెప్టెన్ ది చాలా కీలక పాత్ర అని చెప్పాలి. అలాంటిది సన్ రైజర్స్ కెప్టెన్ గా ఉన్న కెన్ విలియమ్సన్ మాత్రం సీజన్ మొత్తం పూర్తిగా తేలిపోయాడు. ఓపెనర్ గా వచ్చి ఏమీ సాధించలేకపోయారు. మరోవైపు తన పార్టనర్ అభిషేక్ శర్మ అద్భుతంగా ఆడుతోంటే ఇతను మాత్రం తక్కువ స్కోర్ లకే వెనుతిరిగేవాడు. ఓకే బ్యాటింగ్ లో పర్లేదు... కానీ కెప్టెన్సీ తోనూ  రాణించలేక జట్టు ఓటములలో ప్రధాన పాత్ర అయ్యాడు.

* ఇక జట్టులో  ఉన్న బ్యాట్సమన్ వైఫల్యమే ఈ దారుణానికి కారణం అని చెప్పాలి. బౌలింగ్ పరంగా పెద్దగా చెప్పుకునే మైనస్ లు లేవు. భారంగా అంత బ్యాటింగ్ మీదనే ఆధారపడి ఉంటుంది. కేవలం అభిషేక్ శర్మ, త్రిపాఠి లు తప్పించి మిగిలిన వారెవ్వరూ కూడా అనుకున్నంతగా రాణించలేదు. ముఖ్యంగా విలియమ్సన్, పూరన్, మార్ క్రామ్ లు ఫెయిల్ అయ్యారు.

ఇక జట్టులో ఉన్న యువ ఆటగాళ్లకు ఛాన్స్ లు ఇవ్వకుండా ఇంకా తప్పు చేసింది టీమ్ మానేజ్మెంట్. దాదాపు అన్ని టీం లలోనూ యువ ఆటగాళ్లు చాలా బాగా రాణించారు. కానీ సన్ రైజర్స్ ఇందులో ఫెయిల్ అయింది. మరి చూద్దాం వచ్చే సీజన్ అయినా బలంగా గట్టి ప్రణాళికలతో వస్తుందా ?

మరింత సమాచారం తెలుసుకోండి: