క్రికెట్ ప్రేక్షకులందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ నేడు జరగబోతుంది. ఇప్పటివరకు ఐదు సార్లు ఛాంపియన్గా నిలిచిన ముంబై ఇండియన్స్ నాలుగుసార్లు కప్పు కొట్టిన చెన్నై సూపర్ కింగ్స్ లేకుండానే ఇక ఈ ఏడాది ఫైనల్ మ్యాచ్ జరగబోతోంది. ఈ క్రమంలోనే ఐపీఎల్ లోకి కొత్తగా వచ్చిన గుజరాత్ ఇక ఐపీఎల్ లో సీనియర్ జట్టుగా కొనసాగుతున్న రాజస్థాన్ రాయల్స్ మధ్య హోరాహోరీ పోరు జరిగేందుకు అంతా సిద్ధం అవుతుంది. 2008లో ఐపీఎల్ ప్రారంభ సీజన్ లోనే ఫైనల్ కి వెళ్ళి కప్పు కొట్టిన రాజస్థాన్ రాయల్స్ ఆ తర్వాత ప్లే ఆఫ్ లో  అవకాశాలు దక్కించుకోవడానికి కూడా  తంటాలు పడింది.


 రాజస్థాన్ రాయల్స్ జట్టుకు మెగా వేలం ఎంతగానో కలిసొచ్చింది. ఎంతోమంది మంచి ప్లేయర్లను జట్టులోకి తీసుకోవడంతో పటిష్టంగా మారిపోయింది. దీంతో 14 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఫైనల్ లో అడుగు పెట్టి ఇప్పుడు టైటిల్ గెలిచేందుకు  సిద్ధమవుతోంది. అదే సమయంలో ఇక మొదటి సీజన్ లోనే మంచి ప్రదర్శన తో దూసుకుపోతున్న గుజరాత్ టైటాన్స్ జట్టు ఇక టైటిల్ గెలవాలనే పక్కా ప్రణాళికను సిద్ధం చేసుకుంది. కాగా నేడు ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా ఎంతో అంగరంగ వైభవంగా ముగింపు వేడుక జరగబోతుంది అన్న విషయం తెలిసిందే.


 ఈ క్రమంలోనే ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే ఒక అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. ప్రస్తుతం ముగింపు వేడుకలు కారణంగా అరగంట ఆలస్యంగా ఎనిమిది గంటలకు మ్యాచ్ ప్రారంభం కాబోతుంది. అహ్మదాబాద్ వేదికగా ఈ మ్యాచ్ జరుగుతుంది. అయితే ఈ మ్యాచ్ ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు భారత ప్రధాని నరేంద్రమోదీ రాబోతున్నారు. ఇక అంతే కాకుండా ఈ మ్యాచ్ చూసేందుకు ఒక లక్షా 25వేల మంది ప్రేక్షకులు కూడా స్టేడియానికి అనుమతించబోతున్నారు. అయితే ఇది కేవలం ఐపీఎల్ హిస్టరీ లోనే కాదు ప్రపంచ క్రికెట్ చరిత్రలో కూడా ఒక రికార్డు అనే చెప్పాలి. ఇంత పెద్ద సంఖ్యలో ప్రేక్షకులు మ్యాచ్ చూడటం ఇదే మొదటిసారి..

మరింత సమాచారం తెలుసుకోండి: