మరికొన్ని రోజుల్లో టి20 ప్రపంచకప్ ప్రారంభం కాబోతుంది అనే విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రతి ఒక్కరు ఎదురుచూస్తుంది చిరకాల ప్రత్యర్ధులు గా కొనసాగుతున్న పాకిస్తాన్ భారత్ మొదటి మ్యాచ్ గురించి. ప్రపంచ కప్ లో భాగంగా మెల్బోర్న్ వేదికగా అక్టోబర్ 23 వ తేదీన పాకిస్తాన్ భారత్ మధ్య మ్యాచ్ జరగబోతోంది. ఇక ఈ మ్యాచ్ లో ఎవరు విజయం సాధిస్తారో అన్న దానిపై ఇప్పటికే చర్చలు మొదలయ్యాయి అని చెప్పాలి. అయితే గత ఏడాది  ప్రపంచ కప్ లో అక్టోబర్లో పాకిస్తాన్ భారత్ మధ్య మ్యాచ్ జరుగగా  మొదటి సారి భారత్ పాకిస్థాన్ చేతిలో ఓడిపోయింది.


 అది కూడా పది వికెట్ల తేడాతో. దీంతో అప్పటి నుంచి పాకిస్థాన్ క్రికెటర్ లతోపాటు మాజీ క్రికెటర్లు కూడా కాస్త ఓవర్ ఆక్షన్ చేయడం ప్రారంభించారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే  భారత క్రికెట్ను తక్కువగా చేస్తూ మాట్లాడుతూ ఉన్నారు.  అయితే మరికొన్ని రోజుల్లో అటు ప్రపంచకప్ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ఎప్పుడూ భారత్ పై నోరు పారేసుకునే పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పాకిస్తాన్ తో మ్యాచ్ వున్నప్పుడు భారత్ మొక్కుబడిగా జట్టును ఎంపిక చేస్తుందని అసలు అనుకోవడంలేదు. మేనేజ్మెంట్ జట్టును జాగ్రత్తగా ఎంపిక చేసుకోవాలి.


 గత ఏడాది లా కాకుండా ఈ ఏడాది ఎంతో పటిష్టమైన జట్టు పాకిస్థాన్  తో తలపడనుంది అని నమ్ముతున్నాను. ఈసారి పాకిస్తాన్ గెలుపు అంత సులువు కాదు. ప్రపంచ కప్ కోసం భారత్ పటిష్టమైన జట్టును ఎంచుకుంటే  పాకిస్తాన్  ను ఓడించడం సులభమే. ప్రస్తుతం రెండు జట్లు బలాబలాలు సమానంగా ఉన్నాయి. కాబట్టి ఫలితాన్ని ఇప్పుడే అంచనా వేయలేం అంటూ షోయబ్ అక్తర్ చెప్పుకొచ్చాడు. మెగా టోర్నీ లోని మ్యాచ్లో పాకిస్తాన్ భారీ లక్ష్యాన్ని భారత్ ముందు ఉంచితే ఎంతో మంచిదని.. మెల్బోర్న్ క్రికెట్ మైదానంలో వికెట్ చాలా వేగంగా ఉంటుంది అంటూ చెప్పుకొచ్చాడు. ఇక భారత్ పై పాకిస్థాన్ గెలవాలి అంటే ముందుగా బ్యాటింగ్ ఎంచుకోవాలి అంటూ సూచించాడు..

మరింత సమాచారం తెలుసుకోండి: