ఈ ఏడాది ఐపీఎల్లో ఒక్కసారిగా వెలుగు లోకి వచ్చి ప్రపంచ క్రికెట్ ప్రేక్షకుల చూపును తనవైపు తిప్పుకున్న ఆటగాడు ఉమ్రాన్ మాలిక్. సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు తరపున ప్రాతినిధ్యం వహించిన ఈ జమ్మూ కాశ్మీర్ ప్లేయర్ తన ఫాస్ట్ బౌలింగ్ తో అందరిని కూడా అవాక్కయ్యేలా చేశాడు. ఇప్పటివరకు టీమిండియా లో యార్కర్ కింగ్ గా పేరున్న జస్ప్రిత్ బుమ్రా కు సైతం సాధ్యం కాని రీతిలో 150 కిలో మీటర్లకు పైగా వేగంతో బంతులు విసురుతూ అందరినీ ఆశ్చర్య పరిచాడు.



 అంతే కాకుండా ఇక కీలకమైన సమయం లో వికెట్లు పడగొట్టి సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు విజయం లో కీలక పాత్ర వహించాడు. అయితే అతని ప్రతిభను మెచ్చిన భారత సెలెక్టర్లు సౌతాఫ్రికాతో  జరగబోయే టి20 సిరీస్ లో అతనికి అవకాశం కల్పించారు అన్న విషయం తెలిసిందే. ఇక అంతర్జాతీయ క్రికెట్ లో ఉమ్రాన్ మాలిక్ ప్రదర్శన ఎలా ఉండబోతుంది అనేది ప్రస్తుతం ఆసక్తికరం గా మారి పోయింది. ఇకపోతే ఇటీవలే టీమిండియా ఫాస్ట్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్ ప్రతిభ గురించి సౌతాఫ్రికా కెప్టెన్ టెంప బావుమా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.



 టీమిండియా తో ఆడబోయే టీ20 సిరీస్ లో ఉమ్రాన్ మాలిక్ ఫాస్ట్ బౌలింగ్  ను ఎదుర్కునేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాము అంటూ చెప్పుకొచ్చాడు. ఇక తమ జట్టు లో కూడా 150 కిలోమీటర్ల వేగం తో బంతులు విసరగా బౌలర్లు ఉన్నారని తిరుపాడు టెంప బావుమా.  అయితే ఏ బ్యాట్స్మెన్ కూడా 150 కిలోమీటర్లకు పైగా వేగంతో వచ్చే బంతిని ఎదుర్కోవడానికి ఇష్టపడడు అంటూ చెప్పుకొచ్చాడు. ఇక అలాంటి వేగం తో బంతులు విసిరే ఉమ్రాన్ మాలిక్ లాంటి బౌలర్ టీమిండియాకు దొరికాడు.  ఇక ఐపీఎల్లో రాణించినటు గానే  అతను అంతర్జాతీయ క్రికెట్ లో కూడా రాణించాలని ఆశిస్తున్నాను బావుమా తెలిపాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: