గత కొంత కాలం నుంచి టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ పేలవమైన ఫామ్ లో కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఒకప్పుడు తన బ్యాటింగ్తో ఎన్నో రికార్డులను కొల్లగొట్టిన విరాట్ కోహ్లీ ఇక ఇప్పుడు మాత్రం సరైన ప్రదర్శన చేయలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడు. మొన్నటికి మొన్న ముగిసిన ఐపీఎల్ సీజన్ లో కూడా పెద్దగా ఆకట్టుకోలేక పోయాడు విరాట్ కోహ్లీ. ఈ క్రమం లోనే  విరాట్ కోహ్లీ ప్రదర్శన పై ప్రస్తుతం ఎంతో మంది విమర్శలు చేస్తూ ఉన్నారు.  విరాట్ కోహ్లీకి కొన్నాళ్లు విశ్రాంతి అవసరమని ఆ తర్వాత తిరిగి పుంజుకున్నాడు అంటూ మాజీ ఆటగాళ్లు అభిప్రాయం వ్యక్తం చేశారు.



 ఈ క్రమం లోనే ఎన్నో రోజుల నుంచి నిర్విరామం గా క్రికెట్ ఆడుతున్న విరాట్ కోహ్లికి తప్పని సరిగా విశ్రాంతి అవసరమని భావించిన బిసిసిఐ సెలెక్టర్లు ఇక ఇప్పుడు దక్షిణాఫ్రికా తో జరుగుతున్న టీ20 సిరీస్కు ఎంపిక చేయలేదు అన్న విషయం తెలిసిందే. కాగా కొన్నాళ్ల పాటు విశ్రాంతి తీసుకుంటున్న విరాట్ కోహ్లీ మళ్ళీ ఫామ్ సాధించి పుంజుకుంటాడు అని అభిమానులు అనుకుంటున్నారు. ఇకపోతే ఇటీవల ఇదే విషయంపై ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు రికీ పాంటింగ్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.



 ఫామ్ కోల్పోయి ఇబ్బందులు పడుతూ విమర్శలు ఎదుర్కొంటున్న విరాట్ కోహ్లీకి రికీ పాంటింగ్ మద్దతుగా నిలిచాడు. కోహ్లీ మళ్ళీ ఫాంలోకి వస్తాడని అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఇక ప్రతి ఆటగాడి జీవితం లో ఇలాంటి దశ ఉంటుంది అంటూ చెప్పుకొచ్చాడు. దాదాపు దశాబ్ద కాలం నుంచి విరాట్ కోహ్లీ అద్భుతం గా ఆడుతున్నాడు. ఇక ఆ సమయం లో విఫలమైన సందర్భాలు చాలా తక్కువ. తనని తాను అంచనా వేసుకుని.. మళ్లీ తిరిగి ఫాం లోకి వస్తాడని నమ్మకం ఉంది అంటూ రికీ పాంటింగ్ చెప్పుకొచ్చాడు..

మరింత సమాచారం తెలుసుకోండి: