సాధారణంగా పరిమిత ఓవర్ల ఫార్మాట్ అంటే అటు బ్యాట్స్మెన్లు తెగ ఇష్టపడుతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే టెస్టు ఫార్మాట్లో అయితే ఎంతో ఆచితూచి ఆడుతూ ఎక్కువ సమయం పాటు క్రీజులో ఉండాల్సి ఉంటుంది. అదే పరిమిత ఓవర్ల ఫార్మాట్ అయితే నిర్ణీత ఓవర్లలో దంచి కొట్టుడు కొట్టేందుకు అవకాశం ఉంటుంది. అయితే టీ20 ఫార్మాట్లో రావడం రావడమే సిక్సర్లతో చెలరేగి పోవాలి. కానీ వన్డే ఫార్మాట్లో మాత్రం క్రీజులోకి వచ్చిన తర్వాత కుదుర్చుకునేందుకు కాస్త సమయం ఉంటుంది. ఇక క్రీజ్లో కుదురుకున్నారంటే  విజృంభించే రికార్డులు సృష్టించేందుకు ఎంతో అవకాశం ఉంటుంది.


 అందుకే వన్డే ఫార్మాట్లో సెంచరీలతో చెలరేగిపోవడానికి ప్రతి బ్యాట్స్మన్ ఇష్ట పడుతూ ఉంటాడు. ఇప్పటివరకు వన్డే ఫార్మాట్ లో ఎంతో మంది ఆటగాళ్లు రికార్డులు సృష్టించారు అన్న విషయం తెలిసిందే. ఇక ఇటీవలే నెదర్లాండ్స్ ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన వన్డే మ్యాచ్ లో కూడా ఇలాంటి ఒక అరుదైన రికార్డు నమోదయింది. సెంచరీలతో వీర విహారం చేసిన ఇంగ్లండ్ బ్యాట్స్మెన్లు నెదర్లాండ్స్ పై భారీ స్కోరు నమోదు చేశారు. ఏకంగా నిర్ణీత 50 ఓవర్లలో 498 పరుగులు చేశారు. అయితే ఇటీవల ఇంగ్లాండ్ జట్టు చేసిన స్కోర్ కార్డు ప్రపంచ క్రికెట్ లో అత్యధిక కావడం గమనార్హం. ఈ క్రమంలోనే ఇప్పటివరకు అత్యధిక పరుగులు చేసిన జట్లు ఏవి అన్న విషయం కూడా హాట్ టాపిక్ గా మారిపోయింది. .


ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.. ఇంగ్లాండ్ జట్టు నెదర్లాండ్స్ పై నాలుగు వికెట్ల నష్టానికి 498 పరుగులు చేయడం ప్రస్తుతం టాప్ లో ఉంది. ఇంగ్లాండ్ జట్టు ఆస్ట్రేలియా పై చేసిన నాలుగు వందల 81 పరుగులు టాప్ టూ2లో ఉండడం గమనార్హం. అదే ఇంగ్లాండ్ జట్టు పాకిస్తాన్ పై 444 పరుగులు చేసింది. ఇది వన్డే ఫార్మాట్ లో టాప్ 3 అత్యధిక స్కోర్ గా ఉంది. ఇక శ్రీలంక జట్టు నెదర్లాండ్స్ పై 443 పరుగులు చేసింది. సౌత్ ఆఫ్రికా వెస్టిండీస్పై 439 పరుగులతో రాణించింది. ఆ తర్వాత వరుసగా సౌత్ ఆఫ్రికా ఆస్ట్రేలియా పై 438 పరుగులు, ఇండియా పై 438 పరుగులు తో  ఈ లిస్ట్ కొనసాగుతూ ఉండటం గమనార్హం. ఇక ఆస్ట్రేలియా సౌత్ఆఫ్రికాపై 434 పరుగులతో ఈ లిస్టులో ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: